ఏక్తా ర్యాలీ భగ్నం... హార్దిక్‌ పటేల్‌ అరెస్ట్‌

ఏక్తా ర్యాలీ పేరుతో పటేళ్ళ సమైక్యతను చాటేందుకు పటీదార్‌ అనామత్‌ ఆందోళన సమితి (పాస్‌) చేస్తున్న యత్నాలకు  గండి కొట్టే దిశగా గుజరాత్‌ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే పాస్‌ కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ను ఆయన అనుచరులు మరో 50 మందిని సూరత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులాధారిత రిజర్వేషన్లకు అనుకూలంగా పాస్‌ తలపెట్టిన ఈ ర్యాలీకి అనుమతి లేదని, అందుకే వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మంగద్‌ చౌక్‌ వద్ద అదుపులోకి తీసుకున్న వీరందరినీ […]

Advertisement
Update:2015-09-19 06:18 IST
ఏక్తా ర్యాలీ పేరుతో పటేళ్ళ సమైక్యతను చాటేందుకు పటీదార్‌ అనామత్‌ ఆందోళన సమితి (పాస్‌) చేస్తున్న యత్నాలకు గండి కొట్టే దిశగా గుజరాత్‌ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే పాస్‌ కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ను ఆయన అనుచరులు మరో 50 మందిని సూరత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులాధారిత రిజర్వేషన్లకు అనుకూలంగా పాస్‌ తలపెట్టిన ఈ ర్యాలీకి అనుమతి లేదని, అందుకే వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మంగద్‌ చౌక్‌ వద్ద అదుపులోకి తీసుకున్న వీరందరినీ పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. హరిబాగ్‌ ప్రాంతంలో ఇదే ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న పాస్‌ సహ కన్వీనర్‌ నిఖిల్‌ పటేల్‌ను కూడా పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ శాంతియుతంగా ర్యాలీ జరుపుతున్నప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవడం పటేల్‌ వర్గీయులను రెచ్చగొట్టడమేనని, గుజరాత్‌ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క పటేల్‌ని వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. తాము ఏ కులానికి, వర్గానికీ వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రజలంతా తమకు సహకరించాలని ఆయన కోరారు. కేవలం తమకు మేలు జరగాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరికీ కీడు చేయాలని కాదని హార్దిక్‌ అన్నారు. పోలీసుల చర్యను పాస్‌ ‘తమ నిర్బంధం చట్ట వ్యతిరేకం. ప్రజాస్వామ్యంపై గుజరాత్‌ ప్రభుత్వం చేస్తున్న దాడి’ అని అభివర్ణించింది. ఈ ఏక్తా ర్యాలీకి వ్యతిరేకంగా ఓబీసీ ఏక్తా మంచ్‌ కూడా ర్యాలీకి పిలుపు ఇచ్చింది. పోటాపోటీగా నిర్వహించ తలపెట్టిన ఈ ర్యాలీకి కూడా నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. పాస్‌ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని హై అలర్ట్‌లో ఉంచింది.
Tags:    
Advertisement

Similar News