39 మంది భారతీయులు బతికే ఉన్నారు!
గతేడాది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ ఐఎస్) అపహరించుకుపోయిన 39 మంది భారతీయులు బతికే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. గతేడాది జూన్‌లో ఇరాక్ లోని మొసోల్ పట్టణం నుంచి 39 మంది భారతీయ ఉద్యోగులను అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే! బాధితుల కుటుంబ సభ్యులు శుక్రవారం సుష్మాస్వరాజ్‌ను ఢిల్లీలో కలిశారు. వారు సుష్మాను కలవడం ఇది 8వ సారి కావడం గమనార్హం. వీరందరూ ప్రాణాలతో ఉన్నారని తమకు సమాచారం ఉందని […]
Advertisement
గతేడాది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ ఐఎస్) అపహరించుకుపోయిన 39 మంది భారతీయులు బతికే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. గతేడాది జూన్‌లో ఇరాక్ లోని మొసోల్ పట్టణం నుంచి 39 మంది భారతీయ ఉద్యోగులను అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే! బాధితుల కుటుంబ సభ్యులు శుక్రవారం సుష్మాస్వరాజ్‌ను ఢిల్లీలో కలిశారు. వారు సుష్మాను కలవడం ఇది 8వ సారి కావడం గమనార్హం. వీరందరూ ప్రాణాలతో ఉన్నారని తమకు సమాచారం ఉందని వారందరికి సుష్మ భరోసా ఇచ్చారు. బంధీలను విడిపించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని వారికి వివరించారు. బంధీలను విడిపించడంలో సాయపడాలని గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) తోపాటు దాని మిత్రదేశాలతో సుష్మా స్వరాజ్ స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
Advertisement