అఖిల్ ఫంక్షన్ కు మహేష్ ఎందుకొస్తున్నాడు?

అఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్ ఎల్లుండి జరగబోతోంది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయూబోతున్నారు. ఈ ఆడియో వేడుకకు అక్కినేని కాంపౌండ్ కు చెందిన హీరోలంతా వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్లతో పాటు ప్రిన్స్ మహేష్ బాబును కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పిలిచిన వెంటనే మహేష్ కూడా ఈ ఫంక్షన్ కు వస్తానని మాటిచ్చినట్టు సమాచారం. అయితే సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేని […]

Advertisement
Update:2015-09-18 05:46 IST
అఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్ ఎల్లుండి జరగబోతోంది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయూబోతున్నారు. ఈ ఆడియో వేడుకకు అక్కినేని కాంపౌండ్ కు చెందిన హీరోలంతా వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్లతో పాటు ప్రిన్స్ మహేష్ బాబును కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పిలిచిన వెంటనే మహేష్ కూడా ఈ ఫంక్షన్ కు వస్తానని మాటిచ్చినట్టు సమాచారం. అయితే సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేని మహేష్, అఖిల్ ఆడియో ఫంక్షన్ కు రావడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో ఏదో మతలబు ఉందని అంటున్నారు విశ్లేషకులు. వినాయక్ తో మహేష్ బాబు త్వరలోనే సినిమా చేస్తారా.. లేక నాగార్జున-మహేష్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారా.. లేక అన్నపూర్ణ బ్యానర్ లో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడా.. ఇలా ఏదో ఒక లింక్ ఉండే ఉంటుంది.. లేకపోతే అఖిల్ ఆడియో ఫంక్షన్ కు మహేష్ ఎందుకొస్తాడు చెప్పండి.
Tags:    
Advertisement

Similar News