రహమాన్ సొంత మతానికి వచ్చెయ్: వీహెచ్‌పీ
రహమాన్‌కు వీహెచ్‌పీ నుంచి పిలుపు వచ్చింది. ఘర్‌వాప్‌సీ ద్వారా తిరిగి హిందూ మతంలోకి రావాలని ఆహ్వానించింది. మహమ్మద్: ద మెసేంజర్ ఆఫ్ గాడ్ అనే వివాదాస్పద ఇరాన్ చిత్రానికి సంగీతం అందించినందుకు ఏ ఆర్ రహమాన్ కు ముంబైకి చెందిన సున్నీ ముస్లిం మత సంస్థ ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వీహెచ్‌పీ స్పందించింది. రహమాన్ పై ఫత్వా విధించడం దురదృష్టకరమని పేర్కొంది. సొంత మతానికి రావాలని పిలుపునిచ్చింది. అతన్ని సొంత మతం రెండు […]
Advertisement
రహమాన్‌కు వీహెచ్‌పీ నుంచి పిలుపు వచ్చింది. ఘర్‌వాప్‌సీ ద్వారా తిరిగి హిందూ మతంలోకి రావాలని ఆహ్వానించింది. మహమ్మద్: ద మెసేంజర్ ఆఫ్ గాడ్ అనే వివాదాస్పద ఇరాన్ చిత్రానికి సంగీతం అందించినందుకు ఏ ఆర్ రహమాన్ కు ముంబైకి చెందిన సున్నీ ముస్లిం మత సంస్థ ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వీహెచ్‌పీ స్పందించింది. రహమాన్ పై ఫత్వా విధించడం దురదృష్టకరమని పేర్కొంది. సొంత మతానికి రావాలని పిలుపునిచ్చింది. అతన్ని సొంత మతం రెండు చేతులతో సాదరంగా స్వాగతిస్తుందని వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆహ్వానించారు. రహమాన్ రాక కోసం హిందూ సమాజం ఎదురుచూస్తోందని తెలిపారు. అంతేకాకుండా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే రహమాన్ మతం మారాడని అన్నారు. 1967లో తమిళనాడులోని మద్రాసు నగరంలో జన్మించిన రహమాన్ జన్మతః హిందువు. అతని అసలు పేరు ఏ.ఎస్ దిలీప్ కుమార్ 1984లో కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ముస్లిం మతంలోకి మారాల్సి వచ్చింది.
Advertisement