సిట్టింగ్ జాబ్...కట్టింగ్ హెల్త్!
హాయిగా కూర్చుని చేసే పనిలో ఇబ్బంది ఏముంటుంది…ఎంత అదృష్టం అది…. ఈ తరహా మాటలు ఇదివరకటి కాలంలో వినిపించేవి. ఇప్పుడు అలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారి పట్ల జాలి చూపించి, జాగ్రత్తలు చెప్పాల్సిన పరిస్థితి. మనల్నిమోసే కుర్చీలు మనకు చాలా శాపాలు పెడతాయని ఎన్నో ఆరోగ్య పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. గంటల కొద్దీ కూర్చుని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి, అదేపనిగా కుర్చీల్లో చేరగిలబడి టివి చూసేవారికి…ఇలా శరీరానికి కదలిక లేకుండా ఉండేవారికి అధికబరువునుండి, కీళ్లనొప్పులు, గుండెవ్యాధులు లాంటి పలు […]
హాయిగా కూర్చుని చేసే పనిలో ఇబ్బంది ఏముంటుంది…ఎంత అదృష్టం అది…. ఈ తరహా మాటలు ఇదివరకటి కాలంలో వినిపించేవి. ఇప్పుడు అలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారి పట్ల జాలి చూపించి, జాగ్రత్తలు చెప్పాల్సిన పరిస్థితి. మనల్నిమోసే కుర్చీలు మనకు చాలా శాపాలు పెడతాయని ఎన్నో ఆరోగ్య పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. గంటల కొద్దీ కూర్చుని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి, అదేపనిగా కుర్చీల్లో చేరగిలబడి టివి చూసేవారికి…ఇలా శరీరానికి కదలిక లేకుండా ఉండేవారికి అధికబరువునుండి, కీళ్లనొప్పులు, గుండెవ్యాధులు లాంటి పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని ఇప్పటికే వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ తరహా లైఫ్‌స్టయిల్ ఉన్నవారికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పు సైతం పొంచి ఉందని ఓ పరిశోధన వెల్లడించింది. కొంతమంది నడివయసు కొరియన్ల మీద జరిపిన ఓ అధ్యయనం, గంటల తరబడి కూర్చుని ఉండటం ఎంత ప్రమాదమో, శారీరక వ్యాయామం అనేది మనిషికి ఎంత అవసరమో తెలియజేస్తోందని దీని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకపక్క ఎక్కువ గంటలు కూర్చుని ఉంటూ, మరోపక్క శారీరక వ్యాయామం లేకపోతే ఈ రెండూ దేనికది మన శరీరానికి ఎంత హాని చేయాలో అంతా చేస్తాయని వారు చెబుతున్నారు. శరీరబరువు తక్కువ ఉన్నవారికి సైతం ఇలాంటి ప్రమాదం ఉంటుందని ఈ అధ్యయనంలో గుర్తించారు. దక్షిణ కొరియాలోని సియోల్లో ఉన్న సంగిక్వాన్ యూనివర్శిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.