పాక్ ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై ఉగ్ర పంజా
పాకిస్థాన్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. శుక్రవారం ఉదయాన్నే రాకెట్ లాంచర్లతో విరుచుకు పడ్డారు. ఈ సంఘటన పెషావర్‌లో జరిగింది. అయితే అప్రమత్తంగా ఉన్న సైన్యం ఎదురు దాడికి దిగింది. పాక్ రక్షక దళం జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు పది మంది ఉగ్రవాదులు ఒక వ్యూహం ప్రకారం ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై దాడికి దిగారు. పెషావర్‌కు వాయువ్య దిశగా ఉన్న ఓ వైమానిక దళ స్థావరంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. మొదట […]
Advertisement
పాకిస్థాన్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. శుక్రవారం ఉదయాన్నే రాకెట్ లాంచర్లతో విరుచుకు పడ్డారు. ఈ సంఘటన పెషావర్‌లో జరిగింది. అయితే అప్రమత్తంగా ఉన్న సైన్యం ఎదురు దాడికి దిగింది. పాక్ రక్షక దళం జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు పది మంది ఉగ్రవాదులు ఒక వ్యూహం ప్రకారం ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై దాడికి దిగారు. పెషావర్‌కు వాయువ్య దిశగా ఉన్న ఓ వైమానిక దళ స్థావరంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. మొదట వీరు ఓ గార్డు రూంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచే కాల్పులు జరపడం ప్రారంభించారు. దీన్ని పాక్ వైమానిక రక్షక దళం ప్రతిభావంతంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందాలని కొంతకాలంగా ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గత కొద్ది నెలలుగా టెర్రరిస్టులు జరిపిన అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
Advertisement