Wonder World 29
చైనీయుల వింత నమ్మకం! 2015సంవత్సరంలో మేషరాశిలో జన్మించే శిశువులు నాయకులుగా ఎదగలేరని చైనావారి నమ్మకమట. అంతేకాదు వారు ఏ పని చేపట్టినా విఫలమవుతుంటారని కూడా నమ్ముతున్నారు. అందుకే చాలామంది దంపతులు మేషరాశిలో బిడ్డలను కనకుండా వారాలు వర్జ్యాలు చూసుకుని మరీ సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని చైనా పత్రికలు వార్తలు ప్రచురించాయి. —————————————————————————– బోస్టన్ మారథాన్‌లో మొదటి మహిళ! బోస్టన్ మారథాన్‌లో పాల్గొన్న మొట్టమొదటి మహిళ కేథరీన్ స్విట్జర్. 1967 నుంచి ఈ మారథాన్‌లో మహిళలను అనుమతించడం ప్రారంభించారు. […]
చైనీయుల వింత నమ్మకం!
2015సంవత్సరంలో మేషరాశిలో జన్మించే శిశువులు నాయకులుగా ఎదగలేరని చైనావారి నమ్మకమట. అంతేకాదు వారు ఏ పని చేపట్టినా విఫలమవుతుంటారని కూడా నమ్ముతున్నారు. అందుకే చాలామంది దంపతులు మేషరాశిలో బిడ్డలను కనకుండా వారాలు వర్జ్యాలు చూసుకుని మరీ సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని చైనా పత్రికలు వార్తలు ప్రచురించాయి.
—————————————————————————–
బోస్టన్ మారథాన్‌లో మొదటి మహిళ!
బోస్టన్ మారథాన్‌లో పాల్గొన్న మొట్టమొదటి మహిళ కేథరీన్ స్విట్జర్. 1967 నుంచి ఈ మారథాన్‌లో మహిళలను అనుమతించడం ప్రారంభించారు. అయితే అంతకు మునుపే కేథరీన్ ఈ రేసులో పాల్గొని సంచలనం సృష్టించింది. కేథరీన్ ఓ మహిళ అని గుర్తించిన అధికారి ఆమెను రేసు నుంచి బైటకు నెట్టేయబోయాడు. కానీ ఆమె తన బాయ్‌ఫ్రెండ్ సాయంతో రేసును పూర్తి చేసింది. దాంతో జెర్సీ నెంబరుతో మారథాన్‌లో పాల్గొన్న మొట్టమొదటి మహిళగా కేథరీన్ రికార్డు నెలకొల్పింది.
—————————————————————————–
ఒంటె మూపురంలో ఏముంటుంది?
ఒంటె మూపురంలో నీటిని నిల్వ చేసుకుంటుందని, నీటితో నిండి ఉండడం వల్లే మూపురం అలా అటు ఇటు ఊగుతుంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒంటె మూపురం కొవ్వుతో నిండి ఉంటుంది. ఎడారిలో రోజుల తరబడి ఆహారం లేకుండా ప్రయాణించాల్సి వచ్చినపుడు ఒంటెలు ఈ మూపురంలోని కొవ్వును కరిగించుకుంటూ ప్రాణాలు నిలుపుకుంటాయి. తిరిగి ఆహారం బాగా తీసుకోవడం మొదలు కాగానే మూపురాలు ధృఢంగా తయారవుతాయి.