ఇంతకీ తెలుగుదేశాన్ని ఫూల్‌ చేసిందెవరు..?

దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాలపై వరల్డ్ బ్యాంక్ రూపొందించినదని చెబుతున్న జాబితాలో ఏపీకి రెండో స్థానం దక్కటంపై తెలుగుదేశం నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ, చంద్రబాబు పనితనాన్ని, ఈ పదిహేను నెలలపాలనలో ఆయన సాధించిన ఘన విజయాల్ని ప్రపంచబ్యాంక్‌ గుర్తించడంవల్లే తమకు రెండవస్థానం దక్కిందని, ప్రతిపక్షాలు ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు పరిపాలనా దక్షతకు సాటిరారని వీరంగాలేశారు. యనమల రామకృష్ణుడు మరో అడుగు ముందుకువేసి పూనకం వచ్చినట్లుగా చంద్రబాబును కీర్తిస్తూ ఆయనను ప్రపంచనాయకుడిని చేసేసాడు. ఇంతకూ ఈ […]

Advertisement
Update:2015-09-17 06:24 IST

దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాలపై వరల్డ్ బ్యాంక్ రూపొందించినదని చెబుతున్న జాబితాలో ఏపీకి రెండో స్థానం దక్కటంపై తెలుగుదేశం నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ, చంద్రబాబు పనితనాన్ని, ఈ పదిహేను నెలలపాలనలో ఆయన సాధించిన ఘన విజయాల్ని ప్రపంచబ్యాంక్‌ గుర్తించడంవల్లే తమకు రెండవస్థానం దక్కిందని, ప్రతిపక్షాలు ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు పరిపాలనా దక్షతకు సాటిరారని వీరంగాలేశారు. యనమల రామకృష్ణుడు మరో అడుగు ముందుకువేసి పూనకం వచ్చినట్లుగా చంద్రబాబును కీర్తిస్తూ ఆయనను ప్రపంచనాయకుడిని చేసేసాడు. ఇంతకూ ఈ నివేదికను ఎవరు తయారుచేసారు అంటే ఇప్పుడు మేము కాదంటే మేము కాదని ప్రపంచబ్యాంకు, కేంద్రప్రభుత్వం ఆ బాధ్యతనుంచి తప్పుకుని మీరు తయారు చేసారంటే మీరు చేసారని నిందించుకుంటున్నారు. దీంతో ఈ నివేదిక విశ్వసనీయతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు పేరిట తెరపైకి వచ్చిన ఈ నివేదిక వివాదాస్పదం కావడంతో బాధ్యత తమది కాదంటే తమది కాదని అంతా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బయటి సంస్థలు అందించిన సమాచారంతో రూపొందించినందున.. ఈ నివేదికలోని అంశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, వీటిని తమ అభిప్రాయాలుగా భావించరాదని… ఇందులోని అంశాల కచ్చితత్వంపై తాము గ్యారెంటీ ఇవ్వబోమని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా చేపట్టిన 98 అంశాల యాక్షన్ ప్లాన్ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందిందని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఓనూరాల్ వివరణ ఇచ్చారు. అయితే ఆ నివేదికతోనూ.. ఆ ర్యాంకులతోనూ తమకు సంబంధం లేదని, తామెవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మొత్తానికి పారిశ్రామిక అనుకూల వాతావరణ రాష్ర్టాల పేరిట విడుదలైన ఈ నివేదిక ఒక్క రోజు ప్రహసనంగా మిగిలిపోయింది.

Tags:    
Advertisement

Similar News