బ్యాంకులకు పటేల్ దెబ్బ
పటేల్ ఫైట్ తీవ్రమైంది. రిజర్వేషన్ల కోసం హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. ఆర్థిక సహాయనిరాకరణను ప్రారంభిస్తామని ప్రటించిన పటేళ్లు..కార్యాచరణను ప్రారంభించారు. గుజరాత్ లో ధనికవర్గంగా ఉన్న పటేళ్లు..సర్కారుపై ఆర్థికంగా తొలిదెబ్బ కొట్టారు. పటేళ్లంతా బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లను విత్‌డ్రా చేయడం ఆరంభించారు. రిజర్వేషన్ల సాధన కోసం మేము చేపట్టిన ఉద్యమం పరుగుపందెం కాదు..మారథాన్ నిర్వహిస్తున్నామని ప్రకటించిన యువనేత హార్థిక్ పటేల్ దీనికనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు. ప్రభుత్వాన్ని ఆర్ధిక సంక్షోభంలో పడేయడానికి మొదటి ప్రయత్నంగా […]
పటేల్ ఫైట్ తీవ్రమైంది. రిజర్వేషన్ల కోసం హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. ఆర్థిక సహాయనిరాకరణను ప్రారంభిస్తామని ప్రటించిన పటేళ్లు..కార్యాచరణను ప్రారంభించారు. గుజరాత్ లో ధనికవర్గంగా ఉన్న పటేళ్లు..సర్కారుపై ఆర్థికంగా తొలిదెబ్బ కొట్టారు. పటేళ్లంతా బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లను విత్‌డ్రా చేయడం ఆరంభించారు. రిజర్వేషన్ల సాధన కోసం మేము చేపట్టిన ఉద్యమం పరుగుపందెం కాదు..మారథాన్ నిర్వహిస్తున్నామని ప్రకటించిన యువనేత హార్థిక్ పటేల్ దీనికనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు. ప్రభుత్వాన్ని ఆర్ధిక సంక్షోభంలో పడేయడానికి మొదటి ప్రయత్నంగా బ్యాంకుల నుంచి డిపాజిట్ల విత్‌డ్రా చేస్తున్నారు. డబ్బు విత్ డ్రా చేసిన వారంతా తమకు వడ్డీ రాకపోయిన పర్వాలేదు కానీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గుజరాత్‌లో జాతీయ, సహకార బ్యాంకుల నుంచి రోజూ లక్షల రూపాయలు పటేళ్లు విత్‌డ్రాలు చేస్తున్నారు. గుజరాత్ ఉత్తర ప్రాంతానికి చెందిన వడ్రాద్ అనే గ్రామంలో ఓ బ్యాంకు నుంచి ఒకే రోజు దాదాపు 30 లక్షల రూపాయాలు విత్ డ్రా అయ్యాయి. విత్‌డ్రా అయినవన్నీ ఫిక్స్‌డ్ డిపాజిట్లే. సహకార బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో పటేళ్లు లైన్లలో ఉండి డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నారు.