మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు
సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ జాతరను గోదావరి పుష్కరాల కన్నా ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ. 150 కోట్ల మేర ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే జాతరకు సంబంధించి ముందస్తుగా వివిధ శాఖల అధికారులతో మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ వివరాలను దేవాదాయ శాఖ […]
Advertisement
సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ జాతరను గోదావరి పుష్కరాల కన్నా ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ. 150 కోట్ల మేర ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే జాతరకు సంబంధించి ముందస్తుగా వివిధ శాఖల అధికారులతో మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ వివరాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాకు వివరిస్తూ ఈసారి మేడారం జాతరకు 1.25 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసిందని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడానికి 15 శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. జాతరకు ఇంకా 5 మాసాలు సమయం ఉందని, ఈలోపు శాఖలవారీగా ఖర్చు ఏ మేరకు ఉంటుంది..? అనే విషయమై ఈనెలాఖరు వరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అధికారులు సమగ్ర నివేదికలు ఇచ్చిన తర్వాత అక్టోబర్‌లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
Advertisement