ములాయంపై కేసు నమోదు చేయండి: లక్నో కోర్టు
ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను బెదిరించిన కేసులో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై కేసు నమోదు చేయాలని లక్నో సిజెఎం కోర్టు ఆదేశించింది. ఐపీఎస్ ఠాకూర్ భార్య నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వానికి తలనొప్పి తెస్తున్నారంటూ ములాయం ఆయనను బెదిరించారు. అంతటితో ఆగకుండా ఆయనపై రేప్ కేసు పెట్టి సస్పెండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఠాకూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం ములాయంపై కేసు పెట్టాలని పోలీసులను ఆదేశాలు జారీ […]
Advertisement
ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను బెదిరించిన కేసులో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై కేసు నమోదు చేయాలని లక్నో సిజెఎం కోర్టు ఆదేశించింది. ఐపీఎస్ ఠాకూర్ భార్య నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వానికి తలనొప్పి తెస్తున్నారంటూ ములాయం ఆయనను బెదిరించారు. అంతటితో ఆగకుండా ఆయనపై రేప్ కేసు పెట్టి సస్పెండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఠాకూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం ములాయంపై కేసు పెట్టాలని పోలీసులను ఆదేశాలు జారీ చేసింది.
Advertisement