పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై కేంద్రం దృష్టి సారించింది. రైతును ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర వాణిజ్యశాఖమంత్రి నిర్మాలాసీతారామన్ ప్రకాశంజిల్లాలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వాళ్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. రేపు సాయంత్రం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో..నిర్మాలా సీతారామన్, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ కానున్నారు. పొగాకు ధరల పతనం, రైతులు సమస్యలపై సమీక్ష జరపనున్నారు. పొగాకు కొనుగోలుకు కేంద్రం తీసుకోబోయే […]
Advertisement
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై కేంద్రం దృష్టి సారించింది. రైతును ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర వాణిజ్యశాఖమంత్రి నిర్మాలాసీతారామన్ ప్రకాశంజిల్లాలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వాళ్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. రేపు సాయంత్రం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో..నిర్మాలా సీతారామన్, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ కానున్నారు. పొగాకు ధరల పతనం, రైతులు సమస్యలపై సమీక్ష జరపనున్నారు. పొగాకు కొనుగోలుకు కేంద్రం తీసుకోబోయే చర్యలను వెల్లడించి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
Advertisement