Wonder World 28
నోట్లతో అగచాట్లు! కరెన్సీ నోట్లతో అగచాట్లేమిటి అనుకుంటున్నారా? అవి వైరస్‌ల వాహకాలుగా పనిచేస్తున్నాయి. మన శరీరంపై ఏదైనా వైరస్ ఉంటే అది ఐదు నిమిషాల్లో చనిపోతుంది. అదే పేపర్ కరెన్సీ నోట్లపైన మాత్రం దాదాపు 17 రోజుల పాటు జీవించి ఉంటుందంట. అంటే మన కరెన్సీ నోట్లు ఎన్ని రకాల వైరస్‌లను చేరవేస్తున్నాయో గదా? ————————————————————————————————— నార్త్‌పోల్ ఎక్కడుంది? నార్త్‌పోల్ అంటే ఉత్తర ధృవం అని మనకు తెలుసు. కానీ అలాస్కాలో ఈ పేరుతో ఓ పట్టణం […]
నోట్లతో అగచాట్లు!
కరెన్సీ నోట్లతో అగచాట్లేమిటి అనుకుంటున్నారా? అవి వైరస్‌ల వాహకాలుగా పనిచేస్తున్నాయి. మన శరీరంపై ఏదైనా వైరస్ ఉంటే అది ఐదు నిమిషాల్లో చనిపోతుంది. అదే పేపర్ కరెన్సీ నోట్లపైన మాత్రం దాదాపు 17 రోజుల పాటు జీవించి ఉంటుందంట. అంటే మన కరెన్సీ నోట్లు ఎన్ని రకాల వైరస్‌లను చేరవేస్తున్నాయో గదా?
—————————————————————————————————
నార్త్‌పోల్ ఎక్కడుంది?
నార్త్‌పోల్ అంటే ఉత్తర ధృవం అని మనకు తెలుసు. కానీ అలాస్కాలో ఈ పేరుతో ఓ పట్టణం కూడా ఉంది.
—————————————————————————————————
ట్రిలియన్ సెకన్లంటే?
మిలియన్ సెకన్లు, బిలియన్ సెకన్లు, ట్రిలియన్ సెకన్లు… ఇవి ఎన్ని రోజులకు సమానమో తెలుసా? పది లక్షల (మిలియిన్) సెకన్లు 11.5 రోజులు. వందకోట్ల (బిలియన్) సెకన్లు 32 సంవత్సరాలు, లక్ష కోట్ల (ట్రిలియన్) సెకన్లు 32,000 సంవత్సరాలు