సీబీఐ మాజీ అధిప‌తికి విదేశాల్లో భారీ ఆస్తులు!

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ అధిప‌తి రంజిత్ సిన్హా అవినీతి భాగోతాలు ఒక్కొక్క‌టిగా వెలుగుచూస్తున్నాయి. దేశంలోని అవినీతిపై ద‌ర్యాప్తు జ‌ర‌పాల్సిన సీబీఐ డైరెక్ట‌ర్‌కు గ‌ల్ప్‌తోపాటు ఇత‌ర దేశాల్లో వంద‌ల‌కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన‌ట్లుగా సుప్రీంకోర్టు నియమించిన ప్ర‌త్యేక బృందం గుర్తించింది.  ఒక ప్ర‌భుత్వాధికారి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టడం దేశ చ‌రిత్ర‌లో అరుదైన సంఘ‌ట‌న‌గా ప‌లువురు అభి వ‌ర్ణిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద కుంభ‌కోణాలైన‌ 2జీ, బొగ్గు కుంభ‌కోణంలో నిందితుల‌ను కాపాడేయ‌త్నం చేశార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌పై రంజిత్‌సిన్హా […]

Advertisement
Update:2015-09-16 05:41 IST
కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ అధిప‌తి రంజిత్ సిన్హా అవినీతి భాగోతాలు ఒక్కొక్క‌టిగా వెలుగుచూస్తున్నాయి. దేశంలోని అవినీతిపై ద‌ర్యాప్తు జ‌ర‌పాల్సిన సీబీఐ డైరెక్ట‌ర్‌కు గ‌ల్ప్‌తోపాటు ఇత‌ర దేశాల్లో వంద‌ల‌కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన‌ట్లుగా సుప్రీంకోర్టు నియమించిన ప్ర‌త్యేక బృందం గుర్తించింది. ఒక ప్ర‌భుత్వాధికారి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టడం దేశ చ‌రిత్ర‌లో అరుదైన సంఘ‌ట‌న‌గా ప‌లువురు అభి వ‌ర్ణిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద కుంభ‌కోణాలైన‌ 2జీ, బొగ్గు కుంభ‌కోణంలో నిందితుల‌ను కాపాడేయ‌త్నం చేశార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌పై రంజిత్‌సిన్హా డైరెక్ట‌ర్ ప‌ద‌వి కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. రంజిత్ సిన్హా అక్ర‌మాస్తుల విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన సుప్రీం కోర్టు ఈ కేసును ద‌ర్యాప్తు నుంచి అత‌న్ని త‌ప్పించింది. రంజిత్ కేసును ద‌ర్యాప్త చేయ‌డానికి సుప్రీం కోర్టు నియ‌మించనున్న బృందానికి సీబీఐ ప్ర‌త్యేక డైరెక్ట‌ర్ ఎం.ఎల్ శ‌ర్మ నేతృత్వం వ‌హించనున్నట్లు స‌మాచారం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ డీజీ బీబీ మిశ్రా, సీబీఐ ఎస్పీలు జోషి, భూపింద‌ర్ కుమార్‌ ఆయ‌న‌కు స‌హాయంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ బృందం 2జీ, బొగ్గు కుంభ‌కోణం కేసుల్లో నిందితుల‌కు రంజిత్ శర్మ స‌హాయం చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తోపాటు, అత‌నికి విదేశాల్లో అంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా స‌మ‌కూరాయ‌న్న విష‌యాన్ని ద‌ర్యాప్తు చేస్తుంది. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌హాయం కూడా తీసుకోనుంది. రంజిత్ సిన్హా విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ఇండియా నుంచే పెద్ద ఎత్తున డ‌బ్బు త‌ర‌లించార‌ని, ఇందుకోసం హ‌వాలా మార్గం ఎంచుకున్నార‌ని అనుమానిస్తున్నారు.
ఎలా వెలుగుచూసింది..?
సామాజిక ఉద్య‌మ‌కారుడు ప్ర‌శాంత్ భూష‌ణ్ గ‌తేడాది సుప్రీంకోర్టులో ఒక ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. 2జీ, బొగ్గు కుంభ‌కోణం కేసుల్లో నిందితులుగా ఉన్న వ్య‌క్తులు సీబీఐ డైరెక్ట‌ర్ ను క‌లుస్తున్నార‌ని అభియోగం దాఖ‌లు చేశారు. రంజిత్ సిన్హా నిందితుల‌ను కాపాడేందుకు కేసును నీరు గార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టుకు రంజిత్ సిన్హా స‌రైన‌ స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. దీంతో సుప్రీం కోర్టు అత‌న్ని డైరెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. రంజిత్ సిన్హాకు వివాదాలు కొత్తేం కాదు. ఒక‌ప్ప‌డు దేశంలో సంచ‌ల‌నం రేపిన దాణా కుంబ‌కోణం కేసులోనూ నిందితుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని బీహార్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌కు డీజీగా ఉన్న స‌మ‌యంలో అత‌ను అవినీతి ప‌రుడంటూ సొంత ఉద్యోగులే విజిలెన్స్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో మ‌మ‌తా బెన‌ర్జీకి భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యంలోనూ వివాదం చెల‌రేగింది. త‌రువాత రైల్వే మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ ప‌వ‌న్ కుమార్ బ‌న్స‌ల్ బంధువు ఉద్యోగాల పేరిట లంచం తీసుకున్న కేసులో గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌న‌సులో పెట్టుకుని క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌నీ రంజిత్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
Tags:    
Advertisement

Similar News