తెలంగాణలో ఇద్దరు నక్సల్స్ ఎన్‌కౌంటర్
తెలంగాణలో మరోసారి నక్సల్స్ కదలికలు ప్రారంభమయ్యాయి. తాజాగా వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మరణించారు. వీరిద్దరూ కూడా ఇటీవల మావోలు చేసుకున్న రిక్రూట్‌మెంట్‌లో ఉద్యమంలోకి వెళ్లినవారిగా తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో శృతి అలియాస్ మహిత, మనికంటి విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సాగర్‌లు మృతి చెందారు. మహిత ఇదే జిల్లాలోని వడ్డెపల్లికి చెందినది కాగా మరో నక్సల్ సాగర్ ధర్మసాగరం మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందినవాడని పోలీసులు చెబుతున్నారు. […]
Advertisement
తెలంగాణలో మరోసారి నక్సల్స్ కదలికలు ప్రారంభమయ్యాయి. తాజాగా వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మరణించారు. వీరిద్దరూ కూడా ఇటీవల మావోలు చేసుకున్న రిక్రూట్‌మెంట్‌లో ఉద్యమంలోకి వెళ్లినవారిగా తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో శృతి అలియాస్ మహిత, మనికంటి విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సాగర్‌లు మృతి చెందారు. మహిత ఇదే జిల్లాలోని వడ్డెపల్లికి చెందినది కాగా మరో నక్సల్ సాగర్ ధర్మసాగరం మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందినవాడని పోలీసులు చెబుతున్నారు. మహిత ఎంటెక్ పూర్తి చేసి యేడాది క్రితమే మావోల ఉద్యమంలో చేరింది. ఉన్నత విద్యావంతుడైన సాగర్ చేరి కూడా మూడు నెలలు మాత్రమే అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో మావోల ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో తమ బలాన్ని పెంచుకునే దిశలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వివేక్ కూడా విద్యావంతుడే. మావోయిస్టులు కొత్త రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టడం, యువతను, విద్యావంతులను తమ ఉద్యమంలోకి ఆకర్షించడంపై పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement