నారాయణను అరెస్టు చేస్తారా..?

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బీవియస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్ధిని అనుష ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నందుకు ఆ కాలేజీ చైర్మన్‌ బూచేపల్లి సుబ్బారెడ్డిని అరెస్టుచేసి జైలుకు పంపించిన చంద్రబాబు ప్రభుత్వం 11మంది విద్యార్ధిని విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ మంత్రి నారాయణను ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఫైనల్‌ ఇయర్‌ బిటెక్‌ చదువుతున్న అనుష తనకు వచ్చిన మార్కుల విషయంలో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ మాలకొండారెడ్డితో గొడవపడి గురువుపై దాడిచేసింది. ఈ విషయమై […]

Advertisement
Update:2015-09-15 10:04 IST

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బీవియస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్ధిని అనుష ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నందుకు ఆ కాలేజీ చైర్మన్‌ బూచేపల్లి సుబ్బారెడ్డిని అరెస్టుచేసి జైలుకు పంపించిన చంద్రబాబు ప్రభుత్వం 11మంది విద్యార్ధిని విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ మంత్రి నారాయణను ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ఫైనల్‌ ఇయర్‌ బిటెక్‌ చదువుతున్న అనుష తనకు వచ్చిన మార్కుల విషయంలో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ మాలకొండారెడ్డితో గొడవపడి గురువుపై దాడిచేసింది. ఈ విషయమై ఆమె తల్లిదండ్రులను కాలేజీకి పిలిపించి తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించారు. అమ్మాయి ప్రవర్తన సరిగా ఉండేలా చూసుకోమని సలహా ఇచ్చారు.
ఈ సంఘటన తరువాత ఆ అమ్మాయి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు బాధ్యులను చేస్తూ హెచ్‌ఓడీ మాలకొండారెడ్డిని, ఇంజనీరింగ్‌ కాలేజీ చైర్మన్‌ బూచేపల్లి సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచి ఒంగోలు జైలుకు తరలించారు. చైర్మన్‌ బూచేపల్లి అరెస్టు జిల్లా రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. చంద్రబాబు బరితెగించి మరీ ప్రతిపక్షపార్టీ నాయకులను వేదిస్తున్నాడని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ తమ విరోధులను జైళ్ళకు సైతం పంపిస్తున్నాడని ప్రతిపక్షపార్టీలు విమర్శిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News