నా కొడుకుని ఉరి తీస్తా: కన్నడ సీఎం
తప్పు ఎవరు చేసినా తప్పేనని, తనవారికో రూలు… బయటివారికో రూలు ఉండదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. బెంగుళూరులో ఇసుక అక్రమ రవాణా, తవ్వకాల్లో తన కుమారుడి ప్రమేయం ఉన్నట్టు రుజువు చేస్తే తాను చెప్పిన మాటలను యధాతదంగా అమలు చేస్తానని ఆయన అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డాడని ఎవరు రుజువు చేసినా తన కుమారుడ్ని ఉరి తీస్తానని చెప్పారు. ఈ విషయంలో ఆధారాలు ఉంటే చూపించాలని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం నోటికొచ్చినట్టు […]
Advertisement
తప్పు ఎవరు చేసినా తప్పేనని, తనవారికో రూలు… బయటివారికో రూలు ఉండదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. బెంగుళూరులో ఇసుక అక్రమ రవాణా, తవ్వకాల్లో తన కుమారుడి ప్రమేయం ఉన్నట్టు రుజువు చేస్తే తాను చెప్పిన మాటలను యధాతదంగా అమలు చేస్తానని ఆయన అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డాడని ఎవరు రుజువు చేసినా తన కుమారుడ్ని ఉరి తీస్తానని చెప్పారు. ఈ విషయంలో ఆధారాలు ఉంటే చూపించాలని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మాట్లాడవద్దని ఆయన హితవు చెప్పారు.
బీజేపీ నేతలే అక్రమాలకు పాల్పడ్డారని, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జైలు జీవితం కూడా అనుభవించారని గుర్తు చేసిన ఆయన, అటువంటి వారి నుంచి తాను నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఇసుక రవాణాలో సీఎం కుమారుడితోపాటు, కన్నడ మంత్రి మహాదేవప్ప కుమారుడి హస్తం కూడా ఉందంటూ బీజేపీ నేత ఈశ్వరప్ప చేసిన ఆరోపణలకు సిద్ధరామయ్య ఇలా ప్రతిస్పందించారు.
Advertisement