డ్రంకెన్‌ డ్రైవ్‌ నిందితుడికి వినూత్న శిక్ష

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఓ నిందితుడికి న్యాయమూర్తి  రొటీన్‌కు భిన్నంగా ఉండే వినూత్న శిక్ష విధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూర్‌కు చెందిన అసిఫ్‌ అలీ మద్యం సేవించి వాహనం నడుపుతూ శంషాబాద్‌ వద్ద పట్టుబడ్డాడు. అతనికి న్యాయమూర్తి రూ.2,500 జరిమానాతో పాటు శంషాబాద్‌ ప్రాంతంలో ఒకరోజు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఆ మేరకు పోలీసులు అతడి చేత శంషాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ డ్యూటీ చేయించి తీర్పును అమలు పరిచారు.

Advertisement
Update:2015-09-14 18:41 IST

Tags:    
Advertisement

Similar News