అంతా పురుషుల వ‌ల్లే:  మేన‌కాగాంధీ

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ పురుషులపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ప్ర‌స్తుత స‌మాజంలో జ‌రుగుతున్న హింస‌కు కార‌ణం పురుషులేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ యూజర్లతో సోమ‌వారం జ‌రిగిన ముఖాముఖిలో భాగంగా ఆమె మాట్లాడుతూ మగాళ్లే ఎక్కువగా హింసకు పాల్పడుతున్నారని.. లింగ సమానత్వంలో పురుషుల పాత్ర పెరగాలని అభిప్రాయ ప‌డ్డారు. లింగ వివక్షను పారద్రోలడంలో భాగంగా ఇటీవలే జెండర్ చాంపియన్ ను చేపట్టామని తెలిపారు. స్కూల్ దశ నుంచే […]

Advertisement
Update:2015-09-15 05:24 IST
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ పురుషులపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ప్ర‌స్తుత స‌మాజంలో జ‌రుగుతున్న హింస‌కు కార‌ణం పురుషులేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ యూజర్లతో సోమ‌వారం జ‌రిగిన ముఖాముఖిలో భాగంగా ఆమె మాట్లాడుతూ మగాళ్లే ఎక్కువగా హింసకు పాల్పడుతున్నారని.. లింగ సమానత్వంలో పురుషుల పాత్ర పెరగాలని అభిప్రాయ ప‌డ్డారు. లింగ వివక్షను పారద్రోలడంలో భాగంగా ఇటీవలే జెండర్ చాంపియన్ ను చేపట్టామని తెలిపారు. స్కూల్ దశ నుంచే లింగ వివక్షను తరిమివేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మేన‌కాగాంధీ వ్యాఖ్య‌ల‌ను ప‌లువురు త‌ప్పుబ‌డుతున్నారు. ఇటీవ‌ల వెలుగుచూసిన షీనా బోరా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితురాలు ఇంద్రాణి ముఖ‌ర్జియా ఉదంతాన్ని ఉటంకిస్తూ దీనికి ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. స్త్రీల వ‌ల్ల ఎలాంటి నేరాలు జ‌ర‌గ‌డం లేదా? మ‌హిళ‌లు ఎలాంటి నేరాల‌కు పాల్ప‌డ‌టం లేదా అని నిల‌దీస్తున్నారు. అలాంట‌ప్పుడు మ‌హిళా జైళ్ల‌లో ఉన్న‌వారంతా ఎవ‌రని మేన‌కాగాంధీకి ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News