మేడారం జాతరకు జాతీయ హోదాకై వినతి
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీ-టీడీపీ అధికార ప్రతినిధి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడారం జాతరకు మూడు నెలల ముందే పనులు ప్రారంభిస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం పండుగ దగ్గర పడుతున్నా ఇంతవరకు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జాతరలో తరతరాలుగా వస్తున్న తుపాకీ పేల్చి పండుగకు శ్రీకారం చుట్టే సంప్రదాయాన్ని తొలగిస్తామని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ప్రకటనపై ఆమె మండి పడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర వేడుకను ఇది […]
Advertisement
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీ-టీడీపీ అధికార ప్రతినిధి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడారం జాతరకు మూడు నెలల ముందే పనులు ప్రారంభిస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం పండుగ దగ్గర పడుతున్నా ఇంతవరకు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జాతరలో తరతరాలుగా వస్తున్న తుపాకీ పేల్చి పండుగకు శ్రీకారం చుట్టే సంప్రదాయాన్ని తొలగిస్తామని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ప్రకటనపై ఆమె మండి పడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర వేడుకను ఇది అవమానించడమేనని ఆమె అన్నారు.
Advertisement