పెతల్వాద్ పేలుళ్లకు బీజేపీకి సంబంధం
దాదాపు 100 మందిని బలితీసుకున్న పెతల్వాద్ జంట పేలుళ్ల కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. హోటళ్లోని గ్యాస్‌సిలిండర్ పేలడంతో పక్క ఇంట్లో దాచిన జిలిటెన్ స్టిక్స్ కూడా పేలి భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే! జిలిటెన్ స్టిక్స్‌ను భారీగా నిల్వ చేసుకుని అమాయకులైన దాదాపు 100 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన రాజేంద్ర కస్వా స్థానిక బీజేపీ నేత. దీంతో ఆదివారం ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద […]
Advertisement
దాదాపు 100 మందిని బలితీసుకున్న పెతల్వాద్ జంట పేలుళ్ల కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. హోటళ్లోని గ్యాస్‌సిలిండర్ పేలడంతో పక్క ఇంట్లో దాచిన జిలిటెన్ స్టిక్స్ కూడా పేలి భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే! జిలిటెన్ స్టిక్స్‌ను భారీగా నిల్వ చేసుకుని అమాయకులైన దాదాపు 100 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన రాజేంద్ర కస్వా స్థానిక బీజేపీ నేత. దీంతో ఆదివారం ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజేంద్ర కస్వా పరారీలో ఉన్నాడని, ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని ఏఎస్పీ సీమా అల్వా తెలిపారు. రాజేంద్ర కస్వా స్థానికంగా బీజేపీ ట్రేడర్ల విభాగానికి అధ్యక్షుడు. దీంతో వ్యాపం కుంభకోణంలో అనుమానాస్పద మరణాల తరువాత ఈ ఘటన ప్రభుత్వానికి మరో మచ్చగా మారింది. రాజేంద్ర కస్వా జిలిటెన్లను అక్రమంగా నిల్వ చేయడం ఇదేం కొత్త కాదు. 10 ఏళ్లుగా అతను ఇదే వ్యాపారంలో ఉన్నాడు. పెతల్వాద్ కొత్త బస్టాండ్ సమీపంలోనూ జిలిటెన్ స్టిక్స్ నిల్వ ఉంచేవాడు. బీజేపీ అధికారంలోకి రాగానే జనావాసాల మధ్య భారీగా పేలుడు పదార్థాలను నిలువ ఉంచడం మొదలు పెట్టడం ప్రారంభించాడు. గతంలో ఇవి పేలిన ఘటనలో అతని సోదరుడు సైతం మరణించాడు. ఇంతమంది అమాయకుల మరణాలకు కారకుడైన వ్యక్తిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తి కరంగా మారింది.
Advertisement