డిగ్గీరాజాను సాగనంపేందుకు రంగం సిద్ధం!
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనట్లుగా ఉంది’ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం..! ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడగించేందుకు తీసుకున్న నిర్ణయం డిగ్గీరాజా పదవులకు ముప్పు తెచ్చేటట్లుంది. త్వరలోనే ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట ఇన్‌ఛార్జి పదవుల నుంచి ఆయన్ను అధినాయకత్వం తప్పించనున్నట్లు తెలిసింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైన సమయంలోనే ఆయనపై వేటు పడాల్సినప్పటికీ ఎందుకో ఆగిపోయిందట. డిగ్గీరాజా పనితీరుతోపాటు, వ్యక్తిగత వ్యవహార శైలి కూడా ఇందుకు కారణమైందని […]
Advertisement
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనట్లుగా ఉంది’ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం..! ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడగించేందుకు తీసుకున్న నిర్ణయం డిగ్గీరాజా పదవులకు ముప్పు తెచ్చేటట్లుంది. త్వరలోనే ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట ఇన్‌ఛార్జి పదవుల నుంచి ఆయన్ను అధినాయకత్వం తప్పించనున్నట్లు తెలిసింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైన సమయంలోనే ఆయనపై వేటు పడాల్సినప్పటికీ ఎందుకో ఆగిపోయిందట. డిగ్గీరాజా పనితీరుతోపాటు, వ్యక్తిగత వ్యవహార శైలి కూడా ఇందుకు కారణమైందని చర్చ నడుస్తోంది. 65 ఏళ్ల వయసులో ఓ విలేకరితో ప్రేమాయణం నడపటం, రెండో వివాహం చేసుకోవడం తప్పు కానప్పటికీ, ఆయన కారణంగా పార్టీకి నష్టం వాటిల్లినందుకే వేటు వేయాలని అధిష్టానం భావిస్తోందట. 65 ఏళ్లు దాటిన వారిని సలహామండలికి, సీడబ్లూసీకి పరిమితం చేయాలనే నిబంధన గతంలోనే ఉంది. అయినా దీన్ని ఏనాడూ అమలు చేయలేదు. ఇప్పుడు డిగ్గీని తప్పించేందుకు ఈ నిబంధన దస్ర్తాల దుమ్ము దులుపుతున్నారట కాంగ్రెస్ పెద్దలు. పాపం..! డిగ్గీరాజాకు ఇది మింగుడుపడని వార్తే!
Advertisement