విజయవాడ, విశాఖ మెట్రోకు కేంద్ర సాయం: వెంకయ్య
విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకే మెట్రో ప్రాజెక్టు ఇస్తారని అన్నారు. అంత జనాభా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం విజయవాడలో మెట్రో రైల్ తీసుకొస్తామని తెలిపారు. విభజన చట్టంలోని హామీ మేరకు విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టులు నిర్మిస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన రుణం కోసం జపాన్ సంస్థ జైకాతో మాట్లాడుతున్నామని చెప్పారు. […]
Advertisement
విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకే మెట్రో ప్రాజెక్టు ఇస్తారని అన్నారు. అంత జనాభా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం విజయవాడలో మెట్రో రైల్ తీసుకొస్తామని తెలిపారు. విభజన చట్టంలోని హామీ మేరకు విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టులు నిర్మిస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన రుణం కోసం జపాన్ సంస్థ జైకాతో మాట్లాడుతున్నామని చెప్పారు. 2018 డిసెంబర్ నాటికి విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు పూర్తికావాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి వెంకయ్య సూచించారు. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరుకు హైస్పీడ్ రైళ్లు నడిచేలా కృషి చేస్తామన్నారు. దీనిపై డీపీఆర్ సిద్ధం చేయాలని డీఎంఆర్సీకి సూచించినట్లు వెంకయ్య పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్ డీపీఆర్‌ను ఆమోదించి కేంద్రానికి పంపితే పనులు మొదలవుతాయని చెప్పారు.
Advertisement