Wonder World 24

యుగాంతానికి 100 కోట్ల సంవత్సరాలు ప్రపంచం 2000 సంవత్సరంలో అంతమైపోతుందని, ఆ తర్వాత 2012లో అంతమైపోతుందని రకరకాల ఊహాగానాలను మనం చూశాం. కానీ వాస్తవానికి శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే ప్రపంచం అంతం కావడానికి దాదాపు 100 కోట్ల సంవత్సరాలు పడుతుందట. భూమికి సూర్యుడు దగ్గరగా వచ్చేయడంతో భూమిపైన ఉండే జలం, జీవజాలం అంతా అంతర్ధానమైపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అప్పుడు భూమి కూడా మరో సూర్యగోళంలా మారిపోతుందని వారి అంచనా. ———————————————————————————— యుద్ధాన్ని ఆపిన క్రిస్‌మస్‌! మొదటి ప్రపంచ […]

Advertisement
Update: 2015-09-11 13:04 GMT

యుగాంతానికి 100 కోట్ల సంవత్సరాలు


ప్రపంచం 2000 సంవత్సరంలో అంతమైపోతుందని, ఆ తర్వాత 2012లో అంతమైపోతుందని రకరకాల ఊహాగానాలను మనం చూశాం. కానీ వాస్తవానికి శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే ప్రపంచం అంతం కావడానికి దాదాపు 100 కోట్ల సంవత్సరాలు పడుతుందట. భూమికి సూర్యుడు దగ్గరగా వచ్చేయడంతో భూమిపైన ఉండే జలం, జీవజాలం అంతా అంతర్ధానమైపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అప్పుడు భూమి కూడా మరో సూర్యగోళంలా మారిపోతుందని వారి అంచనా.
————————————————————————————
యుద్ధాన్ని ఆపిన క్రిస్‌మస్‌!


మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో భీకరంగా పోరాడుతున్న బ్రిటిష్‌, జర్మనీ సేనలు ఒకరినొకరు చంపుకోవడం ఒక్కసారిగా ఆపేశాయి. ఎప్పుడో తెలుసా? 1914 క్రిస్‌మస్‌ పర్వదినం రోజున. ఆ రోజు ఇరుదేశాల సేనలు కలసి కబుర్లు చెప్పుకోవడమే కాక, ఆహారం, బహుమతులు పంచుకున్నాయి కూడా. అంతేకాదు ఫుట్‌బాల్‌ ఆడుతూ, పాటలు పాడుతూ ఎంజాయ్‌ చేశాయి. అంతేకాదండోయ్‌ రెండుదేశాలూ ఖైదీలను కూడా పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. రెండు దేశాలకు చెందిన దాదాపు లక్ష మంది సైనికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారట.

Tags:    
Advertisement

Similar News