కానుకల సుజాత!
తెలుగుదేశం పార్టీకి మంత్రి పీతల సుజాత పెద్దతలనొప్పిగా మారారు. ఆమె ఖరీదైన చీరలు, బంగారు ఆభరణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడం ఇటీవల కాలంలో చాలా సాధారణ విషయంగా మారింది. మీడియాలో వరుస కథనాలు వస్తున్నా.. ఆమె తీరులో మార్పు కానరావడం లేదు. తాజాగా కర్నూలు పర్యటన సందర్భంగా మంత్రి గారు మరోసారి కానుకలు తీసుకోవడానికి కించిత్ మొహమాట పడలేదు. నవ్విపోదురు గాక.. నాకేంటి? అన్న చందంగా ఉద్యోగుల నుంచి భారీగా విలువైన కానుకలు స్వీకరించారు. కర్నూలు […]
Advertisement
తెలుగుదేశం పార్టీకి మంత్రి పీతల సుజాత పెద్దతలనొప్పిగా మారారు. ఆమె ఖరీదైన చీరలు, బంగారు ఆభరణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడం ఇటీవల కాలంలో చాలా సాధారణ విషయంగా మారింది. మీడియాలో వరుస కథనాలు వస్తున్నా.. ఆమె తీరులో మార్పు కానరావడం లేదు. తాజాగా కర్నూలు పర్యటన సందర్భంగా మంత్రి గారు మరోసారి కానుకలు తీసుకోవడానికి కించిత్ మొహమాట పడలేదు. నవ్విపోదురు గాక.. నాకేంటి? అన్న చందంగా ఉద్యోగుల నుంచి భారీగా విలువైన కానుకలు స్వీకరించారు. కర్నూలు జిల్లాలో ఐసీడీఎస్ సమీక్ష సమావేశానికి స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత బుధవారం హాజరయ్యారు. సమావేశానికి ముందే ఉద్యోగులంతా కలిసి మంత్రి గారికి రూ.90వేల పట్టుచీర, నెక్లెస్ సమర్పించుకున్నారు. ఇందుకోసం ప్రతి ఉద్యోగి నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి మంత్రి పీతల ఆసక్తి కనబరచకపోవడం విశేషం. ఓటుకు నోటు కేసు వెలుగుచూసిన సమయంలోనూ మంత్రి గారి వాకిట్లో రూ.10 లక్షల నగదు దొరికింది. అంతకముందు బంగార ఆభరణాలు కానుకగా తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. మరోసారి ఏపీలో ఏసీబీ చేతిలో పట్టుబడ్డ ఓ ఉద్యోగి తాను లంచం తీసుకుంటుంది మంత్రి గారికి మామూలు సమర్పించుకోవడానికే నంటూ.. తాను వసూలు చేసిన డైరీని చూపించడం విశేషం.
Also Read పీతల సుజాత కేసు క్లోజ్!
Advertisement