న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాల‌తో యువ‌కుడి ఆగ‌డాలు!

అత‌డి పేరు మాజిద్‌..! హైద‌రాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యువ‌కుడు. అడ్డ‌దారిలో డ‌బ్బు సంపాదించాల‌న్న దుర్బుద్ధితో డ‌బ్బున్న అమ్మాయిల‌కు  ఫేస్‌బుక్ స్నేహాన్ని ఎర‌వేశాడు. కొంద‌రిని బ్లాక్‌మెయిల్ చేసి డ‌బ్బులు గుంజాడు. చివ‌రికి ఓ విద్యార్థిని పోలీసుల‌కు ఫిర్యాదు ఇవ్వడంతో క‌ట‌క‌టాలు లెక్క‌పెడుతున్నాడు. న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాల‌తో.. దాదాపు 80 మంది అమ్మాయిలు వీడి బారిన ప‌డ్డారంటే మాజిద్ ఎంత‌టి జిత్తుల మారో అర్థం చేసుకోవ‌చ్చు… వివ‌రాలు.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మురికివాడ‌కు చెందిన మాజిద్ కు సులువుగా […]

Advertisement
Update:2015-09-12 08:13 IST
అత‌డి పేరు మాజిద్‌..! హైద‌రాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యువ‌కుడు. అడ్డ‌దారిలో డ‌బ్బు సంపాదించాల‌న్న దుర్బుద్ధితో డ‌బ్బున్న అమ్మాయిల‌కు ఫేస్‌బుక్ స్నేహాన్ని ఎర‌వేశాడు. కొంద‌రిని బ్లాక్‌మెయిల్ చేసి డ‌బ్బులు గుంజాడు. చివ‌రికి ఓ విద్యార్థిని పోలీసుల‌కు ఫిర్యాదు ఇవ్వడంతో క‌ట‌క‌టాలు లెక్క‌పెడుతున్నాడు. న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాల‌తో.. దాదాపు 80 మంది అమ్మాయిలు వీడి బారిన ప‌డ్డారంటే మాజిద్ ఎంత‌టి జిత్తుల మారో అర్థం చేసుకోవ‌చ్చు… వివ‌రాలు.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మురికివాడ‌కు చెందిన మాజిద్ కు సులువుగా డ‌బ్బు సంపాదించాల‌న్న కోరిక క‌లిగింది. ఇందుకోసం డ‌బ్బున్న స్కూలు విద్యార్థినుల‌కు వ‌ల విసురుదామ‌నుకున్నాడు. న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాల‌తో.. త‌నను తాను అమ్మాయిగా ప‌రిచ‌యం.. చేసుకుని మెల్లిగా స్నేహం చేశాడు. చ‌నువు పెరిగాక వారి న‌గ్న ఫొటోలు పంప‌మన్నాడు. త‌రువాత తాను అడిగినంత డ‌బ్బులు పంప‌క‌పోతే.. ఆ ఫొటోలు నెట్‌లో పెడ‌తానంటూ.. బెదిరించాడు. త‌న‌ను తాను పోలీసాఫీస‌ర్ కూతురుగా ప‌రిచ‌యం చేసుకున్నాడు. దీంతో బెదిరిపోయిన కొంద‌రు విద్యార్థినులు మాజిద్ అడిగినంత స‌మ‌ర్పించుకున్నారు. కానీ, ఇటీవ‌ల ఇలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో నిర్ఘంత‌పోయిన ఓ విద్యార్థిని త‌న త‌ల్లితో కలిసి సీసీఎస్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. అప్ర‌మ‌త్త‌మై పోలీసులు మాజిద్‌ను అరెస్టు చేసి అత‌ని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అత‌ని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపు 200 మంది అమ్మాయిల‌తో స్నేహం చేస్త‌న్న‌ట్లు, 8 న‌కిలీ ఖాతాలు క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించారు. అంతేకాదు, వంద‌ల‌కొద్ది విద్యార్థినుల న‌గ్న చిత్రాలు కూడా అత‌ని ఫోన్‌లో ఉన్నాయి. మాజిద్ నుంచి రూ.86వేల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నామ‌ని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు.
Tags:    
Advertisement

Similar News