మక్కాలో ఘోర ప్రమాదం... 87మంది దుర్మరణం

ముస్లింలకు పరమ పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదు (గ్రాండ్‌ మాస్క్‌)లో నెత్తురు చిందింది. శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు… నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌ ఒకటి చిగురుటాకులా వణికి కూలిపోయింది. మసీదు పైభాగాన్ని చీల్చుకుంటూ కింద పడిపోయిన దుర్ఘటనలో 87 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 184 మంది తీవ్రంగా గాయపడ్డారు. తెల్లటి పాలరాయి పరిచిన మసీదులో రక్తసిక్త దేహాలు అనేకం చెల్లాచెదురుగా కనిపించాయి. ఏటా భారీ సంఖ్యలో వచ్చే హజ్ యాత్రికుల […]

Advertisement
Update:2015-09-12 03:01 IST
ముస్లింలకు పరమ పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదు (గ్రాండ్‌ మాస్క్‌)లో నెత్తురు చిందింది. శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు… నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌ ఒకటి చిగురుటాకులా వణికి కూలిపోయింది. మసీదు పైభాగాన్ని చీల్చుకుంటూ కింద పడిపోయిన దుర్ఘటనలో 87 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 184 మంది తీవ్రంగా గాయపడ్డారు. తెల్లటి పాలరాయి పరిచిన మసీదులో రక్తసిక్త దేహాలు అనేకం చెల్లాచెదురుగా కనిపించాయి. ఏటా భారీ సంఖ్యలో వచ్చే హజ్ యాత్రికుల కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. అత్యంత ముఖ్యమైన గ్రాండ్ మాస్క్‌ను విస్తరించే క్రమంలో మరమ్మతులు చేపట్టారు. ప్రపంచంలోనే భారీ తీర్థయాత్రల్లో ఒకటిగా హజ్‌యాత్రను భావిస్తారు. దీనికి వచ్చే యాత్రికుల సంఖ్య రీత్యా ప్రమాదాలకు కూడా ఇది నెలవుగా ఉంటున్నది. మక్కాలో 2006లో భారీ తొక్కిసలాట చోటు చేసుకోవడంతో వందల మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మసీదును విస్తరించేందుకు సౌదీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు జరుగుతుండగానే మళ్ళీ ఘోరం సంభవించింది. సహాయ సిబ్బంది, వైద్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లారు. ఈనెల 21వ తేదీ నుంచి హజ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్‌సహా అనేక దేశాలకు చెందిన వేలాదిమంది ముస్లింలు దీనికోసం సౌదీ చేరుకున్నారు. వీరిలో చాలామంది శుక్రవారం ప్రార్థనల కోసం పెద్దసంఖ్యలో మక్కా మసీదుకు వచ్చారు. ఈ సమయంలోనే పెను ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల్లోనూ ఎక్కువ మంది హజ్‌ యాత్రికులేనని తెలుస్తోంది. లక్షల సంఖ్యలో వచ్చే యాత్రికుల కోసం సౌదీ ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఏకకాలంలో 22 లక్షల మంది ప్రార్థనలు చేసేందుకు వీలుగా మసీదు విస్తీర్ణాన్ని 4 లక్షల చదరపు మీటర్లకు విస్తరిస్తోంది. దీనికోసం కొన్నాళ్లుగా భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో నిర్మాణ క్రేన్లను ఏర్పాటు చేసి పనులు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో 87 మంది అసువులు బాసారు.
Tags:    
Advertisement

Similar News