కులం అడిగి శిక్షించిన గురువు...
గురు బ్రహ్మ, గురు విష్ణు:, గురు దేవో మహేశ్వర:, గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మయీ శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు తరువాత గురువుకి అంతటి ప్రాధాన్యం ఇచ్చింది భారత సమాజం… కానీ అంతటి ప్రాధాన్యం గల గురువే ఏ కులము నీదని విద్యార్థులను అడగటం.. మన దేశ దౌర్భాగ్యం..! ఏ కులమురా నీది..ఎవడివిరా నీవు.. బ్రాహ్మణుడివా…? క్షత్రియుడివా…? అంటూ వేద పాఠశాల గురువు, విద్యార్థిని చితకబాదిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి […]
గురు బ్రహ్మ, గురు విష్ణు:, గురు దేవో మహేశ్వర:, గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మయీ శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు తరువాత గురువుకి అంతటి ప్రాధాన్యం ఇచ్చింది భారత సమాజం… కానీ అంతటి ప్రాధాన్యం గల గురువే ఏ కులము నీదని విద్యార్థులను అడగటం.. మన దేశ దౌర్భాగ్యం..! ఏ కులమురా నీది..ఎవడివిరా నీవు.. బ్రాహ్మణుడివా…? క్షత్రియుడివా…? అంటూ వేద పాఠశాల గురువు, విద్యార్థిని చితకబాదిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తమిళనాడులోని ఓ వేద పాఠశాలలో అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఓ కుర్రాడిని సాక్షత్తూ గురువే.. కులం పేరుతో దూషిస్తూ.. హింసిస్తున్న వీడియో ఇప్పుడు నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. కనీసం ఈ కుర్రాడికి చేయి విరిగిందన్న కనికరం లేకుండా సదరు గురువు వ్యవహరించిన తీరుపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. కులంపేరుతో దూషించి, పిల్లాడిపై చేయి చేసుకున్న గురువు సోమసుందరంపై చర్యలు తీసుకోవాలని దళిత సేవాసమితి నాయకుడు శేషప్ప విఠల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అతన్ని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై విఠల్ పోలీసులు స్పందించారు. ఘటన కొన్ని రోజుల క్రితమే జరిగిందన్నారు. అయితే దాని తాలూకు దృశ్యాలు లీకవ్వడంతో ఉదంతం వెలుగుచూసిందని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు