తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఉన్న అరెస్టు వారెంట్‌పై మరో నాలుగు వారాలపాటు స్టే విధించింది. ఈమేరకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీస్తా, ఆమె భర్త తీస్తాకు చెందిన స్వచ్ఛంద సంస్థకు చెందిన విదేశీ నిధులను దుర్వినియోగం చేశారని వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈమేరకు తీస్తా తమకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, తీస్తాకు చెందిన స్వచ్ఛంద సంస్థ గుర్తింపును కేంద్ర […]

Advertisement
Update:2015-09-10 18:46 IST
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఉన్న అరెస్టు వారెంట్‌పై మరో నాలుగు వారాలపాటు స్టే విధించింది. ఈమేరకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీస్తా, ఆమె భర్త తీస్తాకు చెందిన స్వచ్ఛంద సంస్థకు చెందిన విదేశీ నిధులను దుర్వినియోగం చేశారని వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈమేరకు తీస్తా తమకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, తీస్తాకు చెందిన స్వచ్ఛంద సంస్థ గుర్తింపును కేంద్ర హోంశాఖ రద్దు చేసింది.
Tags:    
Advertisement

Similar News