హైదరాబాద్‌ను వీడని వర్షం... ట్రాఫిక్ జాం
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం ఆరో రోజు కూడా హైదరాబాద్‌ను తడిసి ముద్ద చేసింది. ఉదయమంతా వాతావరణం ఒక మాదిరిగా ఉంటూ సాయంత్రమయ్యేసరికి దట్టమైన మేఘాలతో వర్షం కుమ్మేస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే ఆపీసుల నుంచి బయటపడాలంటే నానా అగచాట్లకు గురవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం కూడా భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ నుంచి మొదలై గచ్చీబౌలి వరకు వివిధ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, […]
Advertisement
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం ఆరో రోజు కూడా హైదరాబాద్‌ను తడిసి ముద్ద చేసింది. ఉదయమంతా వాతావరణం ఒక మాదిరిగా ఉంటూ సాయంత్రమయ్యేసరికి దట్టమైన మేఘాలతో వర్షం కుమ్మేస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే ఆపీసుల నుంచి బయటపడాలంటే నానా అగచాట్లకు గురవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం కూడా భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ నుంచి మొదలై గచ్చీబౌలి వరకు వివిధ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావునగర్, పార్శిగుట్ట, తుకారాంగేట్, అడ్డగుట్ట, ఫ్యాట్నీ సెంటర్, ప్యారడైడ్, పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చీబౌలి… ఇలా నగరం నలుమూలలా పడిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈదురుగాలులతో కురిసిన వర్షం వల్ల ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద ఓ చెట్లు కూలిపోయింది. నగరంలోని రోడ్లన్నీ జలమయం అవడంతో ట్రాఫిక్ అవస్థలు అన్నీఇన్నీ కావు. ప్రతి ప్రధాన కూడలి వద్దా ట్రాఫిక్ జాంలు మామూలై పోయాయి.
Advertisement