జైనులకు మరాఠా పార్టీల వార్నింగ్
ప్రపంచంలో శాంతమూర్తులని పేరున్న జైనుల వినతి మేరకు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు రోజుల పాటు మాంసం క్రయవిక్రయాలపై నిషేధం విధించడంపై మరాఠా పార్టీలు కన్నెర్ర చేశాయి. శివసేన, ఎంఎన్ఎస్ శ్రేణులు ముంబైలో వీధుల్లోకి వచ్చి మాంస విక్రయాలు జరిపాయి. అంతటితో ఆగకుండా జైనులకు వార్నింగ్ ఇచ్చాయి. శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో జైనులకు హెచ్చరికలు జారీ చేసింది. జైనుల సిద్ధాంతాలను మహారాష్ట్ర ప్రజలపై రుద్దాలని చూస్తే కుదరదంది. ముస్లింలకు పాకిస్ధాన్ అయినా […]
Advertisement
ప్రపంచంలో శాంతమూర్తులని పేరున్న జైనుల వినతి మేరకు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు రోజుల పాటు మాంసం క్రయవిక్రయాలపై నిషేధం విధించడంపై మరాఠా పార్టీలు కన్నెర్ర చేశాయి. శివసేన, ఎంఎన్ఎస్ శ్రేణులు ముంబైలో వీధుల్లోకి వచ్చి మాంస విక్రయాలు జరిపాయి. అంతటితో ఆగకుండా జైనులకు వార్నింగ్ ఇచ్చాయి. శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో జైనులకు హెచ్చరికలు జారీ చేసింది. జైనుల సిద్ధాంతాలను మహారాష్ట్ర ప్రజలపై రుద్దాలని చూస్తే కుదరదంది. ముస్లింలకు పాకిస్ధాన్ అయినా ఉందని, మీరెక్కడికి పోతారంటూ శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే జైనులను హెచ్చరించారు. అటు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే బిజెపిపై కూడా విరుచుకుపడ్డారు. మోఢీని చూసుకుని జైనులు రెచ్చిపోతున్నారని, మహారాష్ట్రలో వాళ్ల పప్పులుడకవని హెచ్చరించారు. బిజెపిని రాజ్ థాకరే భారతీయ జంతు పక్ష్ పార్టీగా అభివర్ణించారు.
Advertisement