జపాన్‌లో వరద బీభత్సం
జపాన్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారిని ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోకు ఉత్తర ప్రాంతాన ఉన్న కినుగావా నది ప్రవాహం ఒక్కసారి పెరిగిపోవడంతో పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు ఇళ్ళు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సహాయక సిబ్బంది వరద ప్రాంతాలకు చేరుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Advertisement