చెరుకు తోటలో మొసలి హల్‌చల్
ఇప్పటివరకు పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి కొండ చిలువలు, చిరుత పులులు రావడం చూశాం. కాని ఈసారి ఇందుకు భిన్నంగా ఓ మొసలి పొలంలోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురి చేసింది. మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లోని దిండిగి గ్రామంలో ఉన్న ఓ చెరుకు తోటలో మొసలి హల్ చల్ చేసింది. అకాస్మాత్తుగా చెరుకు తోటలో మొసలి ప్రత్యక్షం కావడంతో రైతులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ మొసలి గత నాలుగైదు రోజులుగా ఇక్కడి పొలాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం. […]
Advertisement
ఇప్పటివరకు పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి కొండ చిలువలు, చిరుత పులులు రావడం చూశాం. కాని ఈసారి ఇందుకు భిన్నంగా ఓ మొసలి పొలంలోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురి చేసింది. మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లోని దిండిగి గ్రామంలో ఉన్న ఓ చెరుకు తోటలో మొసలి హల్ చల్ చేసింది. అకాస్మాత్తుగా చెరుకు తోటలో మొసలి ప్రత్యక్షం కావడంతో రైతులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ మొసలి గత నాలుగైదు రోజులుగా ఇక్కడి పొలాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం. సమీపంలోని నారింజ ప్రాజెక్టు నుంచి పొలాల్లోకి ఇది చేరినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఇపుడు మొసలి రావడంతో పొలం పనులు చేసుకునే వారిలో ఓ రకమైన భయం మొదలయ్యింది.
Advertisement