చంద్రుడి మరోవైపుపై చైనా దృష్టి
చంద్ర గ్రహానికి ఒకవైపే ఇప్పటివరకు చూశాం. అవతలివైపు ఏముందో తాము త్వరలోనే చూపిస్తామంటోంది చైనా. చంద్రుడి గురించి ప్రపంచానికి తెలియని అవతలి కోణాన్ని ఆవిష్కరించే తొలి దేశంగా ఘనతను సొంతం చేసుకోవడానికి చైనా ఉరకలేస్తోంది. చంద్రగ్రహానికి మరోపక్క భాగంలో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై పరిశోధనలు చేయడానికి చాంగ్‌ఏ-4 ప్రాజెక్ట్‌ను 2020లోగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుడు జో యాంగ్లియావో తెలిపారు. రష్యా, అమెరికాల తర్వాత చాంగ్‌ఏ-3 […]
Advertisement
చంద్ర గ్రహానికి ఒకవైపే ఇప్పటివరకు చూశాం. అవతలివైపు ఏముందో తాము త్వరలోనే చూపిస్తామంటోంది చైనా. చంద్రుడి గురించి ప్రపంచానికి తెలియని అవతలి కోణాన్ని ఆవిష్కరించే తొలి దేశంగా ఘనతను సొంతం చేసుకోవడానికి చైనా ఉరకలేస్తోంది. చంద్రగ్రహానికి మరోపక్క భాగంలో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై పరిశోధనలు చేయడానికి చాంగ్‌ఏ-4 ప్రాజెక్ట్‌ను 2020లోగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుడు జో యాంగ్లియావో తెలిపారు. రష్యా, అమెరికాల తర్వాత చాంగ్‌ఏ-3 మిషన్‌తో చంద్రుడిపై అడుగుపెట్టిన మూడో దేశంగా చైనా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పరిశోధన కోసం ఎక్కువ పేలోడ్‌ను భరించగలిచే చాంగ్‌ఏ-4 మిషన్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు చైనా శాస్త్రవేత్తలు.
Advertisement