రాష్ట్ర ఉద్యోగులకు 3 శాతం డిఏ పెంపు

తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. మంత్రివర్గ తీర్మానం ప్రకారం ఉద్యోగులు పెరిగిన డీఏ అందుకునేందుకు వీలు కల్పిస్తూ వినాయకచవితి కానుకగా జీవో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగులు డీఏ బకాయిలు అందుకోనున్నారు. డీఏ పెంపు వల్ల ఖజానాపై రూ.360 కోట్ల భారం పడనున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఉద్యోగుల మూలవేతనంపై 8.908శాతం డీఏను ప్రభుత్వం చెల్లిస్తున్నది. పెరిగిన 3.144 […]

Advertisement
Update:2015-09-10 05:24 IST
తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. మంత్రివర్గ తీర్మానం ప్రకారం ఉద్యోగులు పెరిగిన డీఏ అందుకునేందుకు వీలు కల్పిస్తూ వినాయకచవితి కానుకగా జీవో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగులు డీఏ బకాయిలు అందుకోనున్నారు. డీఏ పెంపు వల్ల ఖజానాపై రూ.360 కోట్ల భారం పడనున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఉద్యోగుల మూలవేతనంపై 8.908శాతం డీఏను ప్రభుత్వం చెల్లిస్తున్నది. పెరిగిన 3.144 డీఏతో కలిపితే అది 12.052శాతానికి చేరుకుంటుంది. పెంచిన డీఏను జనవరి నుంచి ఆగస్టు నెల వరకు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో జమ చేస్తారు. సెప్టెంబర్ నెల నుంచి పెరిగిన డీఏను నగదురూపంలో అందుకోవచ్చు. పీఆర్సీ -2010 ప్రకారం కనీసవేతనం రూ.6700 తీసుకుంటున్న ఉద్యోగులందరికీ డీఏ పెంపు వర్తిస్తుంది.
Tags:    
Advertisement

Similar News