'శ్రీమంతుడు' సినిమా కథ వెంకయ్యనాయుడిదా?

ఇటీవల విడుదలయి, సూపర్‌ హిట్‌ అయిన మహేష్‌బాబు సినిమా శ్రీమంతుడు. ఆ సినిమా చూసిన వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమా నా కథలా ఉందని, నన్ను చూసి ఈ సినిమా తీసినట్లుందని కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించాడు. తెలంగాణ వీరాభిమానులు, ముఖ్యంగా ‘నెట్‌జన్‌’లకు వెంకయ్యనాయుడు అంటే చాలా కోపం. ఆయన కేంద్ర మంత్రిలా వ్యవహరించకుండా కేంద్రంలో ఉన్న తెలుగుదేశం ఏజంట్‌లా వ్యవహరిస్తున్నాడని, రెండురోజులక్రితం కూడా టాటా సంస్థల చైర్మన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమనికోరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. […]

Advertisement
Update:2015-09-10 06:05 IST

ఇటీవల విడుదలయి, సూపర్‌ హిట్‌ అయిన మహేష్‌బాబు సినిమా శ్రీమంతుడు. ఆ సినిమా చూసిన వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమా నా కథలా ఉందని, నన్ను చూసి ఈ సినిమా తీసినట్లుందని కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించాడు.

తెలంగాణ వీరాభిమానులు, ముఖ్యంగా ‘నెట్‌జన్‌’లకు వెంకయ్యనాయుడు అంటే చాలా కోపం. ఆయన కేంద్ర మంత్రిలా వ్యవహరించకుండా కేంద్రంలో ఉన్న తెలుగుదేశం ఏజంట్‌లా వ్యవహరిస్తున్నాడని, రెండురోజులక్రితం కూడా టాటా సంస్థల చైర్మన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమనికోరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయంలోనూ తెలంగాణకు ద్రోహంచేస్తూ, చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్నాడని విమర్శిస్తూ పనిలోపనిగా శ్రీమంతుడు సినిమా మీద ఆయన చేసిన వ్యాఖ్యపై వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు. అదేమిటంటే – శ్రీమంతుడు సినిమా వెంకయ్యనాయుడిని చూసి తీసింది నిజమే కావచ్చు. అయితే ఆయన పాత్ర మహేష్‌ బాబుది అని ఆయన అనుకుంటున్నాడు. కాని ఆయన పాత్ర భూములు ఆక్రమించే మంత్రి పాత్ర అని మేం అనుకుంటున్నాం అంటూ పోస్ట్‌లు పెట్టారు.

Tags:    
Advertisement

Similar News