తెలంగాణ ఆకాంక్షను, స్ఫూర్తిని రగిలించిన మహానీయుడు కాళోజీ

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదని చాటిన ప్రజా కవి కాళోజీ. ప్రజల గొడవనే తన గొడవగా వినిపించిన మహనీయుడని, ప్రజా సమస్యలపై కడదాకా పోరాడిన గొప్ప వ్యక్తి కాళోజీ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి.  ప్రజల సమస్యలను నా గొడవ అంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. వరంగల్‌లో కాళోజీ […]

Advertisement
Update:2015-09-08 18:49 IST

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదని చాటిన ప్రజా కవి కాళోజీ. ప్రజల గొడవనే తన గొడవగా వినిపించిన మహనీయుడని, ప్రజా సమస్యలపై కడదాకా పోరాడిన గొప్ప వ్యక్తి కాళోజీ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ప్రజల సమస్యలను నా గొడవ అంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. వరంగల్‌లో కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. కాళోజీ గొప్ప వ్యక్తి.. ఆయన విప్లవాలకు నిలయమన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షను, స్ఫూర్తిని రగిలించిన మహానీయుడు కాళోజీ అని కొనియాడారు. కాళోజీ మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News