అసోంలో ఎమ్మెల్యేపై అత్యాచార కేసు న‌మోదు

అసోంలోని ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఇంట్లో పనిచేసే బాలికపై గోపీనాథ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో బోకో పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్ పోస్టులో బాధితురాలు గత నెల 29న ఫిర్యాదు చేసింది. గౌహతిలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడని ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను […]

Advertisement
Update:2015-09-07 18:37 IST
అసోంలోని ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఇంట్లో పనిచేసే బాలికపై గోపీనాథ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో బోకో పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్ పోస్టులో బాధితురాలు గత నెల 29న ఫిర్యాదు చేసింది. గౌహతిలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడని ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఆ బాలిక తమ ఇంటి నుంచి కొన్ని వస్తువులు దొంగిలించి పారి పోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News