రైతులపై ప్రభుత్వం చిన్నచూపు: కోదండరాం
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇందుకోసం తాను రైతుల తరఫున పోరాటానికి కార్యాచరణ తయారు చేస్తున్నానని టీ.జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. నిత్యం తెలంగాణ జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని అన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, బతికుండి ప్రభుత్వంపై కొట్లాడాలని కోదండరాం సూచించారు. […]
Advertisement
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇందుకోసం తాను రైతుల తరఫున పోరాటానికి కార్యాచరణ తయారు చేస్తున్నానని టీ.జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. నిత్యం తెలంగాణ జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని అన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, బతికుండి ప్రభుత్వంపై కొట్లాడాలని కోదండరాం సూచించారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఆయా కుటుంబాల వద్దకు ప్రభుత్వ అధికారులు వెళ్లి పరామర్శించాలని, వారికి భరోసా ఇచ్చి నష్ట పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సరిగా స్పందించకపోతే తాను స్వయంగా రంగంలోకి దిగి బాధితులతో కలిసి పోరాడతానని ఆయన హెచ్చరించారు.
Advertisement