పోర్టు రైతులకు రాజధాని తరహా ప్యాకేజి: మంత్రి కొల్లు
మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తిచేసి హామీ నిలబెట్టుకుంటామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం 14 వేల ఎకరాలకు భూ సమీకరణకు ఆదేశాలు జారీ చేశామని, భూములు ఇచ్చే రైతులకు రాజధాని తరహా ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. పోర్టును అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ప్రతిపక్షపార్టీలను ఆయన విమర్శించారు. మచిలీపట్నం-పెడన మధ్య మెగా టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. భెల్ కంపెనీ తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు […]
Advertisement
మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తిచేసి హామీ నిలబెట్టుకుంటామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం 14 వేల ఎకరాలకు భూ సమీకరణకు ఆదేశాలు జారీ చేశామని, భూములు ఇచ్చే రైతులకు రాజధాని తరహా ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. పోర్టును అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ప్రతిపక్షపార్టీలను ఆయన విమర్శించారు. మచిలీపట్నం-పెడన మధ్య మెగా టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. భెల్ కంపెనీ తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Advertisement