గవర్నర్ మార్పు!
ఎంతోకాలంగా నానుతూ వస్తున్న గవర్నర్ మార్పుపై మరోసారి వార్తలు వస్తున్నాయి. ఈఎస్‌ఎల్ నరసింహన్ ను మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఆయన స్థానంలో జస్టిస్ సదానందం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ర్టాలు విడిపోయినా.. ఇంకా న్యాయపరమైన అనేక చిక్కుముడులు మాత్రం వీడలేదు. అందుకే న్యాయకోవిదుడైన సదానందం అయితే సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తారని కేంద్రం అభిప్రాయపడుతోందని సమాచారం. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న ఈ సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదానందం పేరును […]
Advertisement
ఎంతోకాలంగా నానుతూ వస్తున్న గవర్నర్ మార్పుపై మరోసారి వార్తలు వస్తున్నాయి. ఈఎస్‌ఎల్ నరసింహన్ ను మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఆయన స్థానంలో జస్టిస్ సదానందం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ర్టాలు విడిపోయినా.. ఇంకా న్యాయపరమైన అనేక చిక్కుముడులు మాత్రం వీడలేదు. అందుకే న్యాయకోవిదుడైన సదానందం అయితే సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తారని కేంద్రం అభిప్రాయపడుతోందని సమాచారం. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న ఈ సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదానందం పేరును ఖరారు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది.
ఎందుకు?
2009 డిసెంబరులో అప్పటి గవర్నర్ తివారీ స్థానంలో రాష్ట్రానికి వచ్చిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ర్ట విభజన అనంతరం ఆయన్ను మార్చేందుకు కేంద్రం ప్రయత్నించినా.. ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజన వంటి కీలక సమస్యలు కొలిక్కి రాకుండా మార్చడం మంచిది కాదని వెనక్కి తగ్గి ఆయన్నే కొనసాగిస్తోంది. ఓటుకు నోటుకు కేసు వెలుగుచూసిన దరిమిలా తెలుగుదేశం పార్టీ సెక్షన్-8 ను తెరమీదకు తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్లు పెడతామంటూ నానా యాగీ చేసింది. ఆ సమయంలో గవర్నర్ ఆంధ్రుల రక్షణను గాలికొదిలేశారంటూ.. టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు సహా పలువురు నోటికొచ్చినట్లు దూషించారు. దీంతో గతంలోనే తనను మార్చాలని గవర్నర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ, అప్పుడు కేంద్రంలోని పెద్దలు సర్ది చెప్పడంతో ఆగారు. తరువాత కూడా గవర్నర్‌ను సందు దొరికినపుడల్లా టీడీపీ విమర్శిస్తూనే వస్తోంది. తెలంగాణ అనుకూలవాదిగా ముద్ర వేసి ప్రచారం సాగిస్తోంది. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్ హోం పేరుతో ఇరు రాష్ట్రాల సీఎంలకు గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. దీనికి కేసీఆర్, బాబు ఎవరూ హాజరుకాలేదు. ఇది ఆయనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తప్పుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
Advertisement