ఆ అస్తికలు షీనావే: డీఎన్ ఏ రిపోర్టు!
కూతురు షీనాబోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి ముఖర్జియా కథ ముగిసింది. ఇంతకాలం పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ రోజుకో మాట మాట్లాడుతున్న ఇంద్రాణి ఆటలు ఇక చెల్లవు. ఇప్పటికే హత్యాస్థలంలో లభించిన అస్తికలు షీనావేనని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. తాజాగా నిర్వహించిన డీఎన్ ఏ పరీక్షల్లో సదరు అస్తికలు షీనావేనని రుజువైంది. ఇందుకోసం ఇంద్రాణి నుంచే పోలీసులు రక్తంశాంపిళ్లను తీసుకోవడం గమనార్హం. ఇంతటితో ఇంద్రాణి ఆట కట్టయింది. ఇప్పటికే మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ […]
Advertisement
కూతురు షీనాబోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి ముఖర్జియా కథ ముగిసింది. ఇంతకాలం పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ రోజుకో మాట మాట్లాడుతున్న ఇంద్రాణి ఆటలు ఇక చెల్లవు. ఇప్పటికే హత్యాస్థలంలో లభించిన అస్తికలు షీనావేనని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. తాజాగా నిర్వహించిన డీఎన్ ఏ పరీక్షల్లో సదరు అస్తికలు షీనావేనని రుజువైంది. ఇందుకోసం ఇంద్రాణి నుంచే పోలీసులు రక్తంశాంపిళ్లను తీసుకోవడం గమనార్హం. ఇంతటితో ఇంద్రాణి ఆట కట్టయింది. ఇప్పటికే మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్లు నేరాన్ని అంగీకరించారు. అయితే ఇకపై ఇంద్రాణి నేరాన్ని అంగీకరించినా, లేకున్నా.. పోలీసులు శిక్ష పడేందుకు కావాల్సిన తిరుగులేని ఆధారాలు సంపాదించారు. తాజాగా ఇంద్రాణి, ఆమె భర్త సంజీవ్ఖన్నాలకు కోర్టు రెండువారాలపాటు జ్యుడీషియరీ కస్టడీ విధించింది. ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను కోల్కతాలోని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు.
Advertisement