Wonder World 19
కారు కొంటే కారు ఫ్రీ!! ”ఒక చొక్కా కొంటే మరొకటి ఉచితం”, ”ఒక జత దుస్తులు కొంటే మరో జత ఉచితం”, చివరికి ”ఒక ఫోను కొంటే మరొకటి ఉచితం” వంటి ఆఫర్లనెన్నిటినో మనం చూశాం. ఇది అలాంటి ఆఫర్లన్నిటికీ తలమానికం వంటిది. ఇంత పెద్ద ఆఫర్ బహుశా మన దేశంలో ఇదే ప్రథమమేమో… ”ఒక కారు కొంటే మరో కారు ఉచితం..” గుజరాత్‌లోని ఓ ఆటో డీలర్ ఇచ్చిన ఈ ఆఫర్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. […]
కారు కొంటే కారు ఫ్రీ!!
”ఒక చొక్కా కొంటే మరొకటి ఉచితం”, ”ఒక జత దుస్తులు కొంటే మరో జత ఉచితం”, చివరికి ”ఒక ఫోను కొంటే మరొకటి ఉచితం” వంటి ఆఫర్లనెన్నిటినో మనం చూశాం. ఇది అలాంటి ఆఫర్లన్నిటికీ తలమానికం వంటిది. ఇంత పెద్ద ఆఫర్ బహుశా మన దేశంలో ఇదే ప్రథమమేమో… ”ఒక కారు కొంటే మరో కారు ఉచితం..” గుజరాత్‌లోని ఓ ఆటో డీలర్ ఇచ్చిన ఈ ఆఫర్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నమ్మలేకపోతున్నారు. గుజరాత్‌లో స్కోడా కార్ల డీలర్ ఈ ఆఫర్‌ను ప్రకటించారు. అయితే కండిషన్స్ అప్లయ్. ఇదేం మతలబు అనుకుంటున్నారా…? ఆఫర్లంటే అలానే ఉంటాయి మరి. ఏ కిరికిరి లేకుండా ఊరికే ఇచ్చేస్తారా… ఏంటి? ఈ ఆఫర్‌ను మీరు అందిపుచ్చుకోవాలంటే స్కోడా కార్లలో ర్యాపిడ్ సెడాన్ మోడల్ కారును కొనాల్సి ఉంటుంది. ఈ మోడల్ కారు కొంటే ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ రకం కారును ఉచితంగా ఇస్తారట. అంతే కాదు ఇంకో కండిషన్ కూడా ఉందండోయ్… స్కోడా కారును మీరు ఇప్పుడు కొంటే ఐదేళ్ల తర్వాత అంటే 2018లో మీకు ఫ్యాబియా కారు అప్పగిస్తారట. అదీ మతలబు. అయినా ఇది మంచి ఆఫరేనని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. కార్ల అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు, డీలర్లు పోటీపడి మరీ వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వోక్స్ వ్యాగన్ కూడా ఇటీవలే ఓ ఎక్చ్సేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. మీ పాత కారు తీసుకొచ్చి కొత్త వెంటో సెడాన్ మోడల్ కారును తీసుకెళ్లవచ్చు. మీరు చెల్లించాల్సింది కేవలం ఒక్క రూపాయి మాత్రమే. అయితే ఓ కండిషన్ ఉంది. మీకు ఉపశమనం ఏడాది మాత్రమే. ఏడాది తర్వాత రూపాయి పోను మిగిలిన మొత్తాన్ని 36 ఈఎంఐలలో మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్ఛ్సేంజ్ ఆఫర్ పొందలేని వారికీ ఓ ఆఫర్ ఉంది. అదేమిటంటే కారు మొత్తంలో సగం మొత్తాన్ని ఇపుడు కట్టి కారు తీసుకెళ్లవచ్చు. మిగిలిన సగం మొత్తాన్ని ఏడాది తర్వాత ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు.
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ కూడా ఒక ఆఫర్‌ను ప్రకటించింది. అదేమిటంటే ‘బీట్ ది ట్యాక్స్ హైక్ స్కీమ్’. అంటే బడ్జెట్‌లో పెరిగిన పన్నును కట్టనక్కరలేకుండా వెసులుబాటు ఇచ్చిందన్నమాట. దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై బడ్జెట్‌లో 3శాతం అదనంగా పన్ను వేశారు. ఆడి ఎస్‌యూవీ కార్లను కొనేవారికి ఈ 3శాతం పన్ను ఉండదు. అయితే ఈ ఆఫర్ మార్చి 15 వరకే సుమా.