శ్రీ కాంత్ కొడుకు ల‌వ‌ర్ బాయ్ లుక్ లో అదుర్స్... 

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి..  కొన్ని నెగిటివ్ రోల్స్  చేసి.. ఆ త‌రువా మ‌ధురా న‌గరిలో చిత్రం స‌క్సెస్ తో హీరోగా ప్ర‌మోట్ అయిన శ్రీ‌కాంత్..   కుటుంబ క‌థ చిత్రాల హీరోగా ఒక ద‌శాబ్దం పాటు  ఏలాడు.  ప్ర‌స్తుతం హీరోగా కొన్ని చిత్రాలు చేస్తున్న‌ప్ప‌టీకి అంతాగా   గుర్తింపు రావ‌డం లేదు.  ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ఆడియ‌న్స్ కు  శ్రీ కాంత్  చేస్తున్న చిత్రాలు  పెద్ద‌గా సెట్ కావ‌డం లేదు.   దీంతో ఇక లాభం లేద‌నుకున్నాడో ఏమో .. […]

Advertisement
Update:2015-09-07 05:50 IST

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. కొన్ని నెగిటివ్ రోల్స్ చేసి.. ఆ త‌రువా మ‌ధురా న‌గరిలో చిత్రం స‌క్సెస్ తో హీరోగా ప్ర‌మోట్ అయిన శ్రీ‌కాంత్.. కుటుంబ క‌థ చిత్రాల హీరోగా ఒక ద‌శాబ్దం పాటు ఏలాడు. ప్ర‌స్తుతం హీరోగా కొన్ని చిత్రాలు చేస్తున్న‌ప్ప‌టీకి అంతాగా గుర్తింపు రావ‌డం లేదు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ఆడియ‌న్స్ కు శ్రీ కాంత్ చేస్తున్న చిత్రాలు పెద్ద‌గా సెట్ కావ‌డం లేదు.

దీంతో ఇక లాభం లేద‌నుకున్నాడో ఏమో .. అప్పుడే శ్రీ‌కాంత్ త‌న పెద్ద కుమారుడు రోష‌న్ ను హీరోగా లాంచ్ చేయ‌డానికి రంగం సిద్దం చేసేశారు. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ లో అక్కినేని నాగార్జున నిర్మాత‌గా నిర్మాల కాన్వెంట్ పేరు తో రోష‌న్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రంలో జై చిరంజీవ, దూకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన శ్రేయా శర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. టీనేజ్ ల‌వ్ స్టోరి గ ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో రోష‌న్ లుక్ ను విడుద‌ల చేశారు. ల‌వ‌ర్ బాయ్ గా అద‌ర‌హో అనిపిస్తున్నాడు. నాగార్జునే స్వ‌యంగా త‌న సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్ట‌ర్స్ రిలీజ్ చేయ‌డం విశేషం. శ్రీ‌కాంత్ కు ముగ్గుర సంతానం. ఇద్ద‌రు అబ్బాయిలు. ఒక పాప‌. ముగ్గురిలో పెద్ద‌బ్బ‌యి రోష‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇత‌ని వ‌య‌సు 17 సంంత్స‌రాలు .

Roshan Latest Stills

[gmedia id=1900]

Tags:    
Advertisement

Similar News