స్మార్ట్‌సిటీల్లో యూజర్ చార్జీలు
స్మార్ట్ నగరాల్లో ప్రజలకు యూజర్ ఛార్జీల పేరుతో ప్రభుత్వాలు నడి విరిచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. నగరాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు నిధులను సమకూర్చేందుకుగాను యూజర్ చార్జీలు వసూలు చేయాలనే యోచనలో ఉన్నది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వీటికి తుదిరూపం ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నది. ఇటీవల నగర మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ […]
Advertisement
స్మార్ట్ నగరాల్లో ప్రజలకు యూజర్ ఛార్జీల పేరుతో ప్రభుత్వాలు నడి విరిచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. నగరాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు నిధులను సమకూర్చేందుకుగాను యూజర్ చార్జీలు వసూలు చేయాలనే యోచనలో ఉన్నది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వీటికి తుదిరూపం ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నది. ఇటీవల నగర మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన రీజినల్ వర్క్‌షాప్‌లో పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. వనరులను వినియోగించుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే.. సహకారం అందించేందుకు వారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని అన్నారు.
Advertisement