బాహుబలికి అదనంగా రూ.4 కోట్లు

బాహుబలి సినిమాను ఊహించని మొత్తానికి అమ్మేశారు. లోకల్ తో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డు మొత్తానికి అమ్ముడుపోయింది ఈ సినిమా. అయితే కాస్త డబ్బు ఎక్కువపెట్టి కొన్నప్పటికీ.. ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ లాభపట్టాడు. సినిమాకు రెట్టింపు లాభాలు ఆర్జించాడు. మరోవైపు ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్ అనే సంస్థ అయితే, నిర్మాతలకు తిరిగి 4 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇప్పటికే 9 కోట్ల రూపాయలు చెల్లించి సినిమా హక్కులు దక్కించుకున్న ఈ సంస్థ.. లాభాల్లో […]

Advertisement
Update:2015-09-07 00:35 IST
బాహుబలి సినిమాను ఊహించని మొత్తానికి అమ్మేశారు. లోకల్ తో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డు మొత్తానికి అమ్ముడుపోయింది ఈ సినిమా. అయితే కాస్త డబ్బు ఎక్కువపెట్టి కొన్నప్పటికీ.. ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ లాభపట్టాడు. సినిమాకు రెట్టింపు లాభాలు ఆర్జించాడు. మరోవైపు ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్ అనే సంస్థ అయితే, నిర్మాతలకు తిరిగి 4 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇప్పటికే 9 కోట్ల రూపాయలు చెల్లించి సినిమా హక్కులు దక్కించుకున్న ఈ సంస్థ.. లాభాల్లో ఓవర్ ఫ్లో కారణంగా నిర్మాతలకు తిరిగి మరో 4 కోట్ల రూపాయలు ఇచ్చింది. బాహుబలి విషయంలో ఇది కూడా ఓ రికార్డే. ఏ డిస్ట్రిబ్యూటర్ ఇంత నిజాయితీగా తిరిగి నిర్మాతలకు డబ్బులిచ్చిన సందర్భాలు ఈమధ్య కాలంలో లేవు. మరోవైపు తమిళనాట బాహుబలి సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతుండడం విశేషం. భారీ అంచనాలతో కొన్ని తమిళ సినిమాలు విడుదలైనప్పటికీ.. చెన్నైలో బాహుబలి సినిమాకు ఇంకా వసూళ్లు వస్తూనే ఉన్నాయి. 50రోజులు గడిచినప్పటికీ.. వీకెండ్స్ లో థియేటర్లలో ఆక్యుపెన్సీ రేషియో ఏమాత్రం తగ్గలేదు.
Tags:    
Advertisement

Similar News