Wonder World 18

కొవ్వు కరగాలంటే..! ఊపిరి విడిచే సమయంలోనే మన కొవ్వు కరిగిపోతుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బాగా వ్యాయామం చేసేటపుడు కరిగే కొవ్వులో అధికభాగం కార్బన్‌ డయాక్సయిడ్‌గా మారిపోయి మన ఊపిరితిత్తుల్లో చేరుతుంది. అక్కడి నుంచి మనం గాలి విడిచే సమయంలో అది బైటకు పోతుంది. ———————————————————————————— లోతుల్లోనే భారీ జలచరాలు సముద్రలోతుల్లో భారీ ఆకారాల జలచరాలు ఉంటాయి. ఉపరితల జలాల్లో కంటే ఇవి అనేక రెట్లు పెద్దగా ఉంటాయి. అయితే లోతుల్లోనే ఎందుకు భారీ […]

Advertisement
Update:2015-09-05 18:34 IST

కొవ్వు కరగాలంటే..!


ఊపిరి విడిచే సమయంలోనే మన కొవ్వు కరిగిపోతుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బాగా వ్యాయామం చేసేటపుడు కరిగే కొవ్వులో అధికభాగం కార్బన్‌ డయాక్సయిడ్‌గా మారిపోయి మన ఊపిరితిత్తుల్లో చేరుతుంది. అక్కడి నుంచి మనం గాలి విడిచే సమయంలో అది బైటకు పోతుంది.
————————————————————————————
లోతుల్లోనే భారీ జలచరాలు


సముద్రలోతుల్లో భారీ ఆకారాల జలచరాలు ఉంటాయి. ఉపరితల జలాల్లో కంటే ఇవి అనేక రెట్లు పెద్దగా ఉంటాయి. అయితే లోతుల్లోనే ఎందుకు భారీ ఆకారాల జలచరాలుంటున్నాయనేది ఇంత వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు.
————————————————————————————
మరణతేదీని చెప్పేస్తుంది..!


పాపులేషన్‌ డాట్‌ ఐఓ అనే వెబ్‌సైట్‌ మీరు ఎప్పుడు మరణిస్తారో అంచనా వేసి చెబుతుందట. ఈ వెబ్‌సైట్‌లో మన పుట్టిన రోజును ఎంటర్‌ చేస్తే చాలు మన జీవన కాలం, మనం పుట్టిన రోజునే పుట్టిన ప్రముఖుల వివరాలు, మన కన్నా ఈ ప్రపంచంలో ఎంతమంది చిన్నవారు ఉన్నారు…. అనే విషయాలను చెప్పేస్తుంది.

Tags:    
Advertisement

Similar News