మీరు మారాలని చెప్పేదెవరు బాబూ?
23 జిల్లాలకు పదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు..నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ చంద్రబాబు పదే పదే ప్రకటించేవారు. పాలనాకాలం చివరిదశలో అలిపిరి ఘటన జరిగింది. తాను ప్రాణాలతో ఉన్నానంటే అదంతా ఏడుకొండలవాడి దయ, ప్రజల ఆశీస్సులేనని చెబుతూ.. నేను మారాను, నేను పూర్తిగా మారిపోయాను..ప్రజాసేవకే ఈ జీవితం అంకితం అని తనకు తానుగానే చెప్పుకున్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. నిద్రపోనని చేసిన శపథాన్ని నిజం చేస్తూ..నిద్రకు దూరమయ్యారు. సీఎం కుర్చీకి ..బాబుకు చాలా గ్యాపొచ్చింది. […]
Advertisement
23 జిల్లాలకు పదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు..నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ చంద్రబాబు పదే పదే ప్రకటించేవారు. పాలనాకాలం చివరిదశలో అలిపిరి ఘటన జరిగింది. తాను ప్రాణాలతో ఉన్నానంటే అదంతా ఏడుకొండలవాడి దయ, ప్రజల ఆశీస్సులేనని చెబుతూ.. నేను మారాను, నేను పూర్తిగా మారిపోయాను..ప్రజాసేవకే ఈ జీవితం అంకితం అని తనకు తానుగానే చెప్పుకున్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. నిద్రపోనని చేసిన శపథాన్ని నిజం చేస్తూ..నిద్రకు దూరమయ్యారు. సీఎం కుర్చీకి ..బాబుకు చాలా గ్యాపొచ్చింది. ఈ సంధికాలంలో బాబు లేఖతో23 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. 13 జిల్లాలైంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రిగా బాబు ఎంపికయ్యారు. పదవీప్రమాణస్వీకారోత్సవం రోజే “నేను పూర్తిగా మారిపోయాను. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను. ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తాను. గతంలో ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించాను. ఇకపై అలా జరగదంటూ హామీ ఇస్తున్నాను“ అని ప్రకటించారు. ఇది జరిగి ఏడాదైంది. అదే బాబు..అదే పాలన.. అవే నిర్ణయాలు. మరోసారి నేనేమైనా మారాలా అంటూ కేబినెట్ మీట్‌లో మంత్రులను చంద్రబాబు అడిగారు. ప్రభుత్వ పథకాలు, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు తన పనితీరుపై కూడా సర్వే చేయించుకున్నానని బాబు చెప్పుకొచ్చారు. “ ప్రజలు నా తప్పులు ఎత్తి చూపినా వాటిని సరిదిద్దుకోవడానికి సిద్ధం. నేను అతీతుడినేమీ కాదు“ కాదంటూ ముఖ్యమంత్రి చెప్పడంతో మంత్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట.
సర్వేశ్వరుడు ఆయనే కదా!
సర్వే చేయించిందీ, చేయించుకున్నదీ సీఎం కుర్చీలో ఉన్న చంద్రబాబు అయినప్పుడు..ఆయన పనితీరు భేషుగ్గానే ఉండక చస్తుందా? అని మంత్రులు గుసగుసలాడుకుంటున్నారట. ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తాను మారాలనుకుంటే మారతానని బాబు చెప్పడంలోనే అసలు మెలిక ఉందట. మారాలో, మార్పు చెందాలో బాబుకు తెలియదా? ఒక వేళ బాబుగారు మారాలని తాము చెబితే ..ఆయనేమైనా మారుతారా? దశాబ్దాలుగా మారని మనిషి..ఇప్పుడు మారే అవకాశం ఉందా? అనే సందేహాలు మంత్రుల మధ్యే చక్కర్లు కొట్టాయట. సర్వేలో బాబుపనితీరుకు ప్రజలకు అనుకూలంగా ఓటేస్తారు. ఎందుకంటే సర్వేశ్వరుడు అంటే..సర్వే చేయించింది బాబే కాబట్టి. అంతగా పట్టుబట్టి బాబు అడిగారని ఏ మంత్రో, ఎమ్మెల్యే మీరు మారాలి సార్! అని చెబితే మారేది తమ శాఖలో, కుర్చీలో, నియోజకవర్గాలో తప్పించి బాబు కాదనేది తామెరిగిన సత్యమనే ఆందోళన టీడీపీ కీలక నేతల అందరిలోనూ ఉందట. మారాలని బాబుకు అనిపిస్తే.. అలిపిరి ఘటన తరువాత మారేవారని, పదేళ్లు పదవికి దూరమైనప్పుడే మారేవారని..ఇవేమీ బాబును మార్చలేనప్పుడు తామూ, ప్రజలూ మార్చగలమా అని టీడీపీ నేతలు తమలో తామే గుసగుసలాడుకుంటున్నారట.
Advertisement