వామ్మో... నారాయణ...

మంత్రి నారాయణ అంటే భయపడిపోతున్నారు ఆయన మంత్రి పదవితో ముడిపడ్డ సిబ్బంది, అధికారులు. ఆయన జరిపే టెలి కాన్ఫరెన్స్‌లకు వేళా పాళా ఉండదు. అర్థరాత్రి, తెల్లవారుఝాము అనే తేడా లేకుండా లేడికి లేచిందే పరుగులా వేళకానివేళల్లో టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలతో అధికారులు అల్లాడిపోతున్నారు. తీరా ఈ సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లతో ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అదీ ఉండదు. రొటీన్‌ ఊకదంపుడే. ఈయన మంత్రి అయినప్పటినుంచీ చాలామంది మున్సిపల్‌ అధికారులు నిద్రలేమితో బాధపడుతున్నారట. అర్ధరాత్రి, అపరాత్రి టెలికాన్ఫరెన్స్‌లలో పాల్గొని […]

Advertisement
Update:2015-09-06 01:31 IST

మంత్రి నారాయణ అంటే భయపడిపోతున్నారు ఆయన మంత్రి పదవితో ముడిపడ్డ సిబ్బంది, అధికారులు.
ఆయన జరిపే టెలి కాన్ఫరెన్స్‌లకు వేళా పాళా ఉండదు. అర్థరాత్రి, తెల్లవారుఝాము అనే తేడా లేకుండా లేడికి లేచిందే పరుగులా వేళకానివేళల్లో టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలతో అధికారులు అల్లాడిపోతున్నారు. తీరా ఈ సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లతో ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అదీ ఉండదు. రొటీన్‌ ఊకదంపుడే. ఈయన మంత్రి అయినప్పటినుంచీ చాలామంది మున్సిపల్‌ అధికారులు నిద్రలేమితో బాధపడుతున్నారట. అర్ధరాత్రి, అపరాత్రి టెలికాన్ఫరెన్స్‌లలో పాల్గొని పగలు ఆఫీసులు ఎగ్గొట్టి ఇంట్లో నిద్రపోతూ ఆఫీసు పనులు పెండింగ్‌ పెడుతున్నారట.
ఇవి చాలవన్నట్లు రేపు విజయవాడలో మంత్రి సమీక్షా సమావేశం, అందరూ హాజరుకమ్మని మెసేజ్‌ వెళుతుంది. అందరూ బయలదేరివెళ్ళాకో, సగం దారిలో ఉన్నప్పుడో ఈరోజు సమావేశం రద్దు అని మరో మెసేజ్‌ వస్తుందట. తలలు పట్టుకు కూర్చుంటున్నారు సిబ్బంది. ఆదివారం, పబ్లిక్‌ హాలిడేస్‌లో కూడా మీటింగులు పెడుతున్నాడట.
గతంలో సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న నారాయణ ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడట. ఆయన మాటలు తట్టుకోలేక నెల్లూరు జిల్లా కలెక్టర్‌ అక్కడి నుంచి బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉందట…

Tags:    
Advertisement

Similar News