టీఆర్‌ఎస్ ప్రభుత్వ అన్నదాతల హత్యలు: ఎర్రబెల్లి
తెలంగాణ జిల్లాల్లో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ఇవి నిత్యం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆత్మహత్యలన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యలే నని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని చెప్పారు. రుణమాఫీపై తూతూమంత్రంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. రుణమాఫీలో రూ.1000 కోట్లు […]
Advertisement
తెలంగాణ జిల్లాల్లో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ఇవి నిత్యం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆత్మహత్యలన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యలే నని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని చెప్పారు. రుణమాఫీపై తూతూమంత్రంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. రుణమాఫీలో రూ.1000 కోట్లు దుర్వినియోగమయ్యాయని మంత్రి ఈటెల ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోను కరువు ఉందని, కొన్ని మండలాల్లో తీవ్రంగా ఉందనీ, అన్ని మండలాల్లోనూ రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు.
మెదక్ ఆత్మహత్యల జిల్లాగా మారింది: కిషన్ రెడ్డి
ప్రభుత్వంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెదక్ ఆత్మహత్యల జిల్లాగా మారిందని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలపై ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement